ల్యాండ్ టైటిలింగ్‌పై ఫేక్ ప్రచారం.. బీజేపీపై IYR ఫైర్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ, జనసేన కలిసి చేస్తున్న దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు IYR. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు కర్త, కర్మ కేంద్రంలోని బీజేపీనేనని కుండబద్ధలు కొట్టారాయన. రాష్ట్ర ప్రభుత్వాలు క్రియ మాత్రమేనన్నారు.
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సంచలన ట్వీట్ చేశారు బీజేపీ నేత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి IYR కృష్ణారావు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ, జనసేన ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ.. మీ భూమి మీది కాదు అన్న టైటిల్‌తో ఇచ్చిన పేపర్ యాడ్స్‌ను తీవ్రంగా తప్పుపట్టారు IYR.
ఈ ప్రకటనను ఇచ్చినది @JaiTDP తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో @bjp4andhra భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ @BJP4India . క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు @BJP4Andhra భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? @BJP4Andhra నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా? pic.twitter.com/rxbli0ZqFm
— IYRKRao , Retd IAS (@IYRKRao) May 10, 2024
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ, జనసేన కలిసి చేస్తున్న దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు IYR. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు కర్త, కర్మ కేంద్రంలోని బీజేపీనేనని కుండబద్ధలు కొట్టారాయన. రాష్ట్ర ప్రభుత్వాలు క్రియ మాత్రమేనన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలది అమలు చేసే బాధ్యత మాత్రమేనన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను బూచిగా చూపిస్తూ టీడీపీ ఇవాళ పేపర్లలో ఇచ్చిన ప్రకటనల్లో రాష్ట్ర బీజేపీ ఎలా భాగస్వామ్యం తీసుకుందని ప్రశ్నించారు IYR.
రాష్ట్ర బీజేపీ నిద్రావస్థలో ఉందా..? అంటూ పరోక్షంగా పార్టీ స్టేట్ చీఫ్ పురందేశ్వరిని తన ట్వీట్‌లో నిలదీశారు IYR. మరీ ఇంకేదైనా కారణం ఉందా చెప్పాలంటూ సొంతపార్టీపైనే ఫైర్ అయ్యారు. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందించింది కేంద్రమే. కొన్ని రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం, జనసేన తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ.. రాష్ట్ర బీజేపీ నేతలు ఉద్దేశపూర్వక మౌనం పాటిస్తున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలను భయాందోళనకు గురి చేసేలా తనకు అనుకూలమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫుల్ పేజీలో యాడ్స్ ఇచ్చింది. దీనిపైనే IYR అభ్యంతరం వ్యక్తం చేశారు.