బూతు ఆడియో.. భుజాలు తడుముకుంటున్న టీడీపీ
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాటన్నిటికీ ఇలా అధికారికంగా స్పందిస్తూ పోవడం అసాధ్యం. కానీ దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోడానికి టీడీపీ ప్రయత్నించడమే ఇక్కడ విశేషం.
ఏపీ రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆడియో ట్రాక్ వైరల్ అవుతోంది. ఈరోజు ఉదయం నుంచి ఈ ఆడియో ట్రెండింగ్ లోకి వచ్చింది. పచ్చి బూతులతో ఉన్న ఆడియో రికార్డింగ్ అది. ఓ మహిళ కులంపేరుతో మరో వ్యక్తిని దూషిస్తున్నట్టుగా ఉంది. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ నారా భువనేశ్వరిది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు.
టీడీపీ కౌంటర్..
ఆ వాయిస్ నాారా భువనేశ్వరిది అని నేరుగా వైసీపీ నేతలెవరూ కామెంట్ చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం అదే పేరుతో సర్కులేట్ అవుతోంది. దీంతో వెంటనే టీడీపి అలర్ట్ అయింది, భుజాలు తడుముకొంటోంది. అది ఫేక్ ఆడియో అని, కావాలనే వైసీపీ ఇలాంటివి సృష్టించిందని అంటున్నారు టీడీపీ నేతలు. ఏకంగా టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కౌంటర్ ట్వీట్ పడటం విశేషం. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాటన్నిటికీ ఇలా అధికారికంగా స్పందిస్తూ పోవడం అసాధ్యం. కానీ దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోడానికి టీడీపీ ప్రయత్నించడమే ఇక్కడ విశేషం.
మొన్న ఇంటలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్, నిన్న ఈటీవీ వీడియోతో ఫేక్, నేడు భువనేశ్వరి గారి ఆడియోని డీప్ ఫేక్ చేశారు.
— Telugu Desam Party (@JaiTDP) April 26, 2024
జగన్ రెడ్డి... భువనేశ్వరి గారంటే ఎందుకు నీకు అంత కడుపు మంట ? అసెంబ్లీలో బూతులు తిట్టించి నవ్వుకున్నావ్, ఇప్పుడు ఆమె ఆడియోని ఫేక్ చేసావ్...
ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని,… pic.twitter.com/XwHyQjJu9z
ఆ ఆడియో రికార్డింగ్ లో ఉన్న గొంత ఎవరిది..? అంత ఘాటుగా ఆమె ఎవర్ని తిట్టారు..? ఎందుకు తిట్టారు అనేది ఇంకా బయటకు రాలేదు. కానీ నారా భువనేశ్వరి పర్యటనలతో బిజీగా ఉన్న సందర్భంలో ఆమె వాయిస్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఆడియో ట్రాక్ మాత్రం ట్రెండింగ్ లోకి వచ్చింది. అందులో పచ్చిబూతులుండటంతో దాన్ని షేర్ చేయాలనుకున్నా కూడా నాయకులు కాస్త ముందు వెనక ఆలోచిస్తున్నారు.