వివాదంలోకి విజయమ్మను లాగిన టీడీపీ
తెలంగాణలో పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై నిరసనకి దిగిన సందర్భంగా విజయమ్మ మాట్లాడారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రకి అనుమతి ఇవ్వకపోవడం కుట్రపూరితం అంటోంది టీడీపీ. పోలీసు వర్గాలు మాత్రం కొన్ని వివరాలు అడిగామని చెబుతున్నాయి. పాదయాత్ర అనుమతి విషయంలో మొదటి నుంచీ టీడీపీ నుంచి ఆరోపణలు వస్తున్నా పోలీసులు స్పందించలేదు. వైసీపీ నేతలు హూ ఈజ్ లోకేష్ అంటూనే రోజూ మీడియా ముందుకొచ్చి లోకేష్ జపం చేసి, వారే పాదయాత్రని హైలైట్ చేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభానికి గడువు దగ్గరపడటంతో అనుమతి విషయంలో టీడీపీలో టెన్షన్ నెలకొంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సంబంధంలేని అంశంతో కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. వివాదంలోకి జగన్ తల్లి విజయమ్మని లాగారు.
తెలంగాణలో పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై నిరసనకి దిగిన సందర్భంగా విజయమ్మ మాట్లాడారు. పాదయాత్రని రిజెక్ట్ చేసే ఏ ప్రభుత్వాన్నీ ఇప్పటివరకూ తాను చూడలేదన్నారు. ప్రతిపక్షాలను గౌరవించాలని సూచించారు. ప్రతిపక్షాలను గౌరవించే ప్రభుత్వాలు మన్నన పొందుతాయన్నారు. ఇలా ఏ ప్రభుత్వం పాదయాత్రని ఆపలేదన్నారు.
ఈ వీడియోని సాక్ష్యంగా పోస్ట్ చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి లోకేష్ పాదయాత్రని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడని టీడీపీ సోషల్ మీడియా ఎత్తి చూపుతోంది. వైఎస్సార్టీపీ పాదయాత్ర గురించి తెలంగాణలో మాట్లాడిన విజయమ్మ మాటలను ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముడిపెట్టడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.