అస్సలు బాలేదు ఎమ్మెల్యే గారు..! టీడీపీ కౌంటర్
సింపుల్ గా జగన్ పాత వీడియోని ట్వీట్ చేసింది టీడీపీ. తన వ్యాఖ్యానాన్ని పరిమితంగా జోడించింది. మరి పాత వీడియోపై జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి.
ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే ముద్దు అంటూ జగన్ ట్వీట్ వేసిన వెంటనే టీడీపీ కౌంటర్ ఇచ్చింది. గతంలో జగన్ ఈవీఎం పోలింగ్ ను సమర్థిస్తూ మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. "151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి, 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అస్సలు బాలేదు పులివెందుల ఎమ్మెల్యే గారు." అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి సమాధానం వచ్చింది.
గతంలో జగన్ ఏమన్నారు..?
"ఈవీఎంలలో 80శాతం జనాభా ఓట్లు వేశారు, అది రికార్డ్ పోలింగ్. వారంతా పోలింగ్ బూత్ లో బటన్ నొక్కారు. అలా బటన్ నొక్కాక ఏ పార్టీకి ఓటు వేశారనేది వీవీప్యాట్ లో కనపడుతుంది. వారు వేసిన ఓటు, వీవీప్యాట్ లో కనిపించిన ఓటు సరిపోయాయి కాబట్టే వారు శాటిస్ఫాక్షన్ తో బయటకు వచ్చారు. అందుకే వారెవరూ కంప్లయింట్ చేయలేదు. ఒకవేళ నేను ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తే, వీవీప్యాట్ లో సైకిల్ గుర్తుకి ఓటు వేసినట్టు వస్తే నేనెందుకు గమ్మునుంటా, కంప్లయింట్ లాంచ్ చేసేవాడిని కదా..? అలా జరగలేదు కాబట్టే ఎలాంటి కంప్లయింట్ లు లేవు, పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్ లోనూ అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లు కూర్చుంటారు, వారంతా కూర్చున్న తర్వాత ఈవీఎంలను చెక్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. 50ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. వాళ్లు నొక్కిన గుర్తు, వీవీప్యాట్ లో వచ్చిన స్లిప్ గుర్తు రెండూ మ్యాచ్ అయ్యాయో లేవో చూసుకుంటారు. ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెడతారు. మేం 50 ఓట్లు వెరిఫై చేశాం, ఈవీఎంలు బాగానే పనిచేస్తున్నాయని సంతకాలు పెడతారు. అలా సంతకాలు పెట్టిన తర్వాతే జనరల్ పబ్లిక్ కి ఓటు వేసేందుకు అవకాశమిస్తారు. మరి టీడీపీ ఏజెంట్లు వెరిఫైడ్ అని సంతకాలు పెట్టినా కూడా ఈవీఎంలలో అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఇవే ఈవీఎంలు, ఇవే వీవీప్యాట్ లు.. ఆయనకు అనుకూలంగా ఓట్లు పడితే బాగున్నట్టు. లేదంటే తప్పు జరిగినట్టు. ప్రజల గాలి తనవైపు లేదని తెలుసుకుని ఎంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ, ప్రజా తీర్పుని అవహేళన చేస్తూ మాట్లాడే ఈ మనిషి అసలు మనిషేనా అంటున్నా. తాను గెలిస్తే అన్నీ బాగున్నట్టు, తాను ఓడిపోతే ఈవీఎంలపై నెపం నెట్టడం. ఆయన బుద్ధే అది. ఓడిపోతే నా కంప్యూటర్ కరెక్ట్, బటన్ నొక్కడం కరెక్ట్ గా లేదు అంటారు. ఇలాంటి దుర్మార్గుడు, మోసగాడు, రాక్షసుడు, అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది."
151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి,
— Telugu Desam Party (@JaiTDP) June 18, 2024
11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అస్సలు బాలేదు పులివెందుల ఎమ్మెల్యే గారు.#EndOfYCP #AndhraPradesh https://t.co/o1ZnBQQpko pic.twitter.com/qYlI8rNE21
సింపుల్ గా జగన్ పాత వీడియోని ట్వీట్ చేసింది టీడీపీ. తన వ్యాఖ్యానాన్ని పరిమితంగా జోడించింది. మరి పాత వీడియోపై జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ రియాక్ట్ అవుతారా, లేక అది 2019 ఫలితాల సమయంలో ఇచ్చిన వీడియో, ఇది 2024 అని సర్ది చెప్పుకుంటారా..? అసలు పాత వీడియో ఒకటి ఉందని, జగన్ అప్పుడలా మాట్లాడారని వైసీపీ ఒప్పుకుంటుందా, లేదా..? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.