యాత్ర-2 పై టీడీపీ కుట్రలు.. కానీ ఇలా దొరికేశారు!
జీవోలో అంతా బానే మేనేజ్ చేసినప్పటికీ..అసలు సీఎస్ ఎవరనే విషయంలో తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు పచ్చ తమ్ముళ్లు. మాజీ సీఎస్ నీలం సాహ్ని పేరుతో ఈ జీవో తయారు చేశారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం నేతలు బరితెగిస్తున్నారు. ముందు, వెనుక చూసుకోకుండా ఫేక్ ప్రచారానికి ఎగబడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఫేక్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు.జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు తెగులు తమ్ముళ్లు చేస్తున్న కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయి. తాజాగా ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ జీవితం ఆధారంగా రూపొందించిన యాత్ర-2 సినిమా ఇవాళ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను టార్గెట్ చేసింది ఎల్లో గ్యాంగ్. సినిమాకు సంబంధించి ఓ ఫేక్ జీవోను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పచ్చ తమ్ముళ్లు.
ఇంతకీ జీవోలో ఏముందంటే..యాత్ర-2 సినిమాకు థియేటర్ల ఫుల్ ఉండేలా చూడాలని..ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసినట్లు ఓ ఫేక్ జీవో తయారు చేశారు. ఫస్ట్ రెండు రోజులు ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సినిమా చూసేలా ఆదేశాలు జారీ చేయాలని ఈ జీవోలో పేర్కొన్నారు. వాలంటీర్లు సైతం సంక్షేమ పథకాలు పొందుతున్న పది మందిని థియేటర్లకు తరలించేలా చూడాలని ఈ జీవోలో ఉంది. విలేజ్ వాలంటీర్ ఒక్కొక్కరికి పది టికెట్లు కేటాయించేలా థియేటర్ ఓనర్లతో కలెక్టర్లు మాట్లాడాలంటూ ఓ ఫేక్ జీవోను తయారు చేసి సోషల్‌మీడియాలో వదిలారు.
ఐతే ఫేక్ జీవో తయారు చేసిన ఎల్లో గ్యాంగ్ ఓ విషయంలో మాత్రం పప్పులో కాలేసింది. జీవోలో అంతా బానే మేనేజ్ చేసినప్పటికీ..అసలు సీఎస్ ఎవరనే విషయంలో తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు పచ్చ తమ్ముళ్లు. మాజీ సీఎస్ నీలం సాహ్ని పేరుతో ఈ జీవో తయారు చేశారు. కానీ నీలం సాహ్ని 2020 డిసెంబర్ 31నే ఏపీ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి కొనసాగుతున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమనే నమ్మకంతోనే తెలుగుదేశం శ్రేణులు కుట్రలకు తెరలేపాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏపీలో జగన్ సునామీని చంద్రబాబు అడ్డుకోలేరని కామెంట్స్ చేస్తున్నారు.