మృతుల ఒక్కో కుటుంబానికి రూ.23 లక్షలు టీడీపీ పరిహారం
తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కో కుటుంబానికి రూ.15లక్షలు, టీడీపీ నేతలు ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షలు కలిపి 23 లక్షల రూపాయలు సాయం అందించాలని తీర్మానించారు.
నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.23 లక్షలు పరిహారం అందించాలని టీడీపీ నిర్ణయించింది. కందుకూరు ఘటనపై టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలోనే చనిపోయిన వారి కుటుంబాలకు రూ.23 లక్షలు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కో కుటుంబానికి రూ.15లక్షలు, టీడీపీ నేతలు ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షలు కలిపి 23 లక్షల రూపాయలు సాయం అందించాలని తీర్మానించారు.
ఈ ఆర్థిక సాయం చెక్ లను మృతులకు ఇళ్లకు వెళ్లి చంద్రబాబు అందించనున్నారు. భద్రతాపరమైన అనుమతులు ఇవ్వడంలోనూ, రక్షణ చర్యలు తీసుకోవడంలోనూ పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఇంతటి నష్టం జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రికి పర్యటనకు వేల మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలకు కనీస భద్రత కల్పించడంలేదని విమర్శించారు.