ఎన్నికల్లో చంద్రబాబు నినాదమిదేనా?
రేపటి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కవుట్ అవ్వాలంటే `లాస్ట్ ఛాన్స్` అనే నినాదమే బాగుంటుందని చంద్రబాబుకు తమ్ముళ్ళు చెప్పారట. తనకివే చివరి ఎన్నికలన్న కొంతమంది విషయంలో స్లోగన్ వర్కవుటైన ఘటనలను కూడా ఉదహరించారట. దాంతో తొందరలోనే ఇదే నినాదాన్ని టీడీపీ కాయిన్ చేయబోతోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికలకు చంద్రబాబు నాయుడు కొత్త స్లోగన్‌ను రెడీ చేసుకుంటున్నారట. అదేమిటంటే ‘ఒక్క లాస్ట్ ఛాన్స్’ అనే నినాదంతో సెంటిమెంటును ప్రయోగించాలని అనుకుంటున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ‘ఒక్క ఛాన్స్’ అనే జగన్మోహన్ రెడ్డి స్లోగన్ బాగా క్లిక్కయిన విషయాన్ని కొందరు తమ్ముళ్ళు చంద్రబాబుకు గుర్తుచేశారట. ఈ విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు చాలా వేదికల మీద ప్రస్తావించారు కూడా, ఒక్క ఛాన్స్..ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని జగన్ నాశనం చేసేస్తున్నారంటు గోలగోల చేస్తున్నారు.
ఒక్క ఛాన్స్ అనే సెంటిమెంటుకు జనాలు పడిపోయి జగన్‌కు అధికారం కట్టబెట్టేశారని చంద్రబాబు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. తన పరిపాలనతో విసిగిపోయిన జనాలు వైసీపీని అఖండ మెజారిటితో అధికారంలోకి తెచ్చారనే విషయాన్ని గుర్తించటానికి చంద్రబాబు ఏమాత్రం ఇష్టపడటంలేదు. దానికి విరుగుడుగానే `లాస్ట్ ఛాన్స్` అనే స్లోగన్ ఎలాగుటుందనే చర్చ పార్టీలో నడుస్తోంది. అచ్చంగా ఇలాగే కాకపోయినా ఆ మధ్య కర్నూలు జిల్లా పర్యటనలో రాబోయేవే చివరి ఎన్నికలు అని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
చివరి ఎన్నికలంటే తనకా లేకపోతే పార్టీకా అనే సందేహం వచ్చేసింది జనాల్లో.. అప్పటికే చంద్రబాబుతో పాటు పార్టీకి కూడా రాబోయేవే చివరి ఎన్నికలని మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే ఎద్దేవా చేశారు. మంత్రులు చెప్పేదాన్నే చంద్రబాబు కూడా కన్ఫర్మ్ చేసినట్లయ్యింది. ఆ విషయాన్ని తమ్ముళ్ళు గుర్తుచేయగానే చంద్రబాబు మాట మార్చేశారు. చివరి ఎన్నికలంటే తనకు కాదని రాష్ట్రాభివృద్ధికని ప్లేటు ఫిరాయించేశారు.
సరే అప్పట్లో ఏమి జరిగినా రేపటి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కవుట్ అవ్వాలంటే `లాస్ట్ ఛాన్స్` అనే నినాదమే బాగుంటుందని చంద్రబాబుకు తమ్ముళ్ళు చెప్పారట. తనకివే చివరి ఎన్నికలన్న కొంతమంది విషయంలో స్లోగన్ వర్కవుటైన ఘటనలను కూడా ఉదహరించారట. దాంతో తొందరలోనే ఇదే నినాదాన్ని టీడీపీ కాయిన్ చేయబోతోందని తమ్ముళ్ళు చెప్పారు. జగన్ ఒక్క ఛాన్స్ నినాదం వర్కవుటయ్యిందంటే అందుకు చాలా కారణాలున్నాయి. కానీ చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అనే నినాదం వర్కవుటవుతుందా? స్లోగన్ వర్కవుటయ్యేందుకు సానుకూలించే కారణాలున్నాయా? అన్నదే పెద్ద సందేహం.