Telugu Global
Andhra Pradesh

పవన్ స్టైల్‌నే చంద్రబాబు ఫాలో అవుతున్నారా?

మామూలుగా అయితే ఇలా అరవటం చంద్రబాబు స్టైల్‌ కాదు. వాదన పెట్టుకుంటారు కానీ ఇలా పూనకం వచ్చిన వాళ్ళలాగ గట్టగట్టిగా అరిచింది ఎప్పుడూ లేదు. ఇలాంటి చేష్టలు మాములుగా అయితే పవన్ దగ్గరే చూస్తారందరు.

TDP chief Chandrababu Naidu following Pawan Kalyan style?
X

పవన్ స్టైల్‌నే చంద్రబాబు ఫాలో అవుతున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్టైల్‌నే చంద్రబాబునాయుడు ఫాలో అవుతున్నారా? కుప్పంలో పోలీసులతో చంద్రబాబు వాగ్వాదం చూసిన తర్వాత.. మాట్లాడిన మాటలు విన్నతర్వాత ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభుత్వం రూల్‌ను బ్రేక్ చేయటానికే చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నారు. రాజకీయ పార్టీల రోడ్డు షోలు, రోడ్లపైన సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు హడావుడిగా కుప్పం పర్యటన పెట్టుకున్నారు. అందరు అనుకున్నట్లుగానే చంద్రబాబును పోలీసులు శాంతిపురం మండలం పెద్దూరు దగ్గర అడ్డుకున్నారు. దాంతో చంద్రబాబుకు పోలీసులతో పెద్ద వాగ్వాదమే జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే పోలీసులతో వాదన సమయంలో చంద్రబాబు చాలా పెద్ద పెద్దగా అరిచారు. మైకులో కూడా గట్టిగా అరుస్తూ మాట్లాడారు.

తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ఊగిపోయారు. మామూలుగా అయితే ఇలా అరవటం చంద్రబాబు స్టైల్‌ కాదు. వాదన పెట్టుకుంటారు కానీ ఇలా పూనకం వచ్చిన వాళ్ళలాగ గట్టగట్టిగా అరిచింది ఎప్పుడూ లేదు. ఇలాంటి చేష్టలు మాములుగా అయితే పవన్ దగ్గరే చూస్తారందరు. సభల్లో మాట్లాడుతూ.. హఠాత్తుగా మైకులో గట్టిగా అరవటం, వార్నింగులివ్వటం, శాపనార్ధాలు పెట్టడం అంతా పవన్ స్టైల్. ఎందుకరుస్తారో తెలీదు, ఎందుకు ఊగిపోతారో తెలీదు, ఇంత హఠాత్తుగా అంతటి ఆవేశాన్ని ఎందుకు ప్రదర్శిస్తారో కూడా ఎవరికీ తెలీదు.

మొదట్లో ఏదో అనుకున్నారు కానీ తర్వాత‌ త‌ర్వాత పవన్ సమావేశాల్లో ఇది రెగ్యులర్ అయిపోవటంతో జనాలు అలవాటుపడిపోయారు. అలాంటి పద్దతిలోనే ఇప్పుడు చంద్రబాబు కూడా ఊగిపోతూ అరచి మాట్లాడటంతో జనాలందరు ఆశ్చర్యపోయారు. పవన్ మాటలకు అర్ధాలు ఉండనట్లే చంద్రబాబు మాటల్లో కూడా అర్ధం లేదు. 1861 చట్టం ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం ఏమిటని ఒకవైపు డీఎస్పీని నిలదీస్తూనే, మళ్ళీ ఏ చట్టం ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో తనకు చెప్పాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.

First Published:  5 Jan 2023 11:02 AM IST
Next Story