టీడీపీ తొలి జాబితాలో శుద్ధ పూసలెన్నో!
మాచర్ల అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. పల్నాడు ఫ్యాక్షన్‌లో ఆయన పేరు సువర్ణాక్షరాలతో గొప్ప ఫ్యాక్షనిస్టుగా ఆయనకు పేరుంది.
వైసీపీ రౌడీ రాజకీయం చేస్తుంది. వారి అభ్యర్థుల జాబితాలో రౌడీలు, ఎర్రచందనం స్మగర్లు కూడా ఉన్నారని ఈ రోజు టీడీపీ, జనసేన జాబితా విడుదల సందర్భంగా కూడా చంద్రబాబు ఎకసెక్కాలాడారు. కానీ చంద్రబాబు ప్రకటించిన 94 మంది జాబితాలో కూడా చాలామంది శుద్ధ పూసలే ఉన్నారు. హత్య కేసుల్లో నిందితులు, రియల్ ఎస్టేట్ దందాల్లో జనాన్ని ముంచినవాళ్లు, టీవీ డిబేట్లలో చెప్పులతో కొట్టే బాపతు ఇలా చాలామందే ఉన్నారు.
ఏడుగుర్ని హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడు మాచర్ల అభ్యర్థి
మాచర్ల అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. పల్నాడు ఫ్యాక్షన్‌లో ఆయన పేరు సువర్ణాక్షరాలతో గొప్ప ఫ్యాక్షనిస్టుగా ఆయనకు పేరుంది. 2001లో బ్రహ్మారెడ్డికి వరుసకు బాబాయ్ అయ్యే జూలకంటి సాంబిరెడ్డితో సహా ఏడుగురు ప్రయాణిస్తున్న జీపును లారీ ఢీకొట్టడంతో వారంతా చనిపోయారు. ఇది ప్రమాదం కాదని, ఫ్యాక్షన్ హత్యలని తెలిసి ఉమ్మడి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఇది చేయించిందని బ్రహ్మారెడ్డి అంటూ ఆయనను ప్రధాన నిందితుడిగా చేర్చారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న అతణ్ని మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించడానికి తెచ్చిపెట్టుకున్నారు చంద్రబాబు. ఆయన వచ్చాకే పల్నాడులో మళ్లీ వర్గ పోరాటాలు, ఫ్యాక్షన్ గొడవలు తీవ్రస్థాయికి చేరిన సంగతి అందరికీ తెలుసు. అలాంటి బ్రహ్మారెడ్డికి టికెటిచ్చారు బాబు.
ఆర్జీవీ తలతెస్తే కోటిరూపాయలు ఇస్తానన్న కొలికిపూడికీ టికెట్
ఇక అమరావతి జేఏసీ లీడర్‌గా తరచూ వార్తల్లో కనబడి జగన్‌ను నోటికొచ్చినట్లు తిట్టే కొలికిపూడి శ్రీనివాసరావుకు తిరువూరు టికెటిచ్చారు చంద్రబాబు. ఓ టీవీ డిబేట్‌లో లైవ్‌లోనే బీజేపీ లీడర్ విష్ణువర్ధన్‌రెడ్డిని చెప్పుతో కొట్టిన ఘనుడు కొలికిపూడి. అంతేకాదు ఇటీవల మరో టీవీ లైవ్ డిబేట్‌లో డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ తల తెచ్చిచ్చినవారికి కోటి రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటించడంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇంకా చాలామందే ఉన్నారు.. వీళ్లు జస్ట్ టార్చ్‌బేరర్లు మాత్రమే!