BJPపై రఘురామకృష్ణరాజు బాంబులు
బీజేపీ వల్ల కూటమి బలం పెరుగుతుందా అంటే.. నో కామెంట్, తాను మాట్లాడను అన్నారు. పైగా తనను తిరస్కరించిన పార్టీ గురించి అస్సలు మాట్లాడను అన్నారు.
ఏపీలో కూటమి ఏమాత్రం సీట్లు గెలుస్తుందో గానీ.. పొత్తు అంటే వాళ్లలో వాళ్లకే భలే గమ్మత్తుగా ఉన్నట్టుంది. పొత్తుధర్మం, పొత్తుధర్మం అంటూనే కూటమిపై ఎంత కసి ఉందో అంత కసి తీర్చుకుంటున్నారు. తాజాగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీపై సెటైర్లు పేల్చారు రఘురామకృష్ణరాజు. తనకు టికెట్ ఇవ్వలేదన్న బాధ, ఆక్రోశంతో రఘురామ రగిలిపోతున్నారు.
బీజేపీ వల్ల కూటమి బలం పెరుగుతుందా అంటే.. నో కామెంట్, తాను మాట్లాడను అన్నారు. పైగా తనను తిరస్కరించిన పార్టీ గురించి అస్సలు మాట్లాడను అన్నారు. "సభ్యత్వం లేదని బీజేపీ నన్ను సింపుల్‌గా పక్కన పెట్టేసింది. అదేంటి మిగతా నియోజకవర్గాల్లో టికెట్ ఇచ్చారు కదా.. అని మీరు నన్ను అడగొద్దు". ఈ మాటలు వింటేనే అర్థం చేసుకోవచ్చు. కూటమిపై ఆపార్టీ నేతల్లోనే ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది.
మరోసారి జగన్‌పై నోరు పారేసుకున్నారు రఘురామ కృష్ణరాజు. గులకరాయి దాడి పెద్ద డ్రామా అని జగనే గీరుకున్నాడు అని నోటికొచ్చినంతా మాట్లాడారు. "జగన్ తనను ఎంపీగా చూడకూడదు అనుకున్నాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. కానీ, రేపు ప్రత్యక్ష నరకం అనుభవిస్తాడంటూ" అప్పుడే గెలిచిపోయినట్లు, అసెంబ్లీలో అడుగుపెట్టినట్లు తనకు తాను ఓవర్‌గా ఊహేంచేసుకుంటున్నారు రఘురామకృష్ణరాజు.