తేలిన పొత్తుల లెక్కలు.. లోక్‌సభకు పవన్ కల్యాణ్ పోటీ?
బీజేపీకి అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపురం, రాజంపేట సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. జనసేన తనకు కేటాయించిన అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ సీట్లలో ఒక్క సీటును వదులుకుంటుంది.
టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తుల లెక్కలు తేలినట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీకి, జనసేనకు కలిపి 8 లోక్‌సభ స్థానాలు, 30 శాసనసభ స్థానాలు దక్కినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో బీజేపీ ఆరు లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తుందని, జనసేన తనకు కేటాయించిన మూడు సీట్లలో ఒక్క సీటును తగ్గించుకుంటుందని సమాచారం.
బీజేపీకి అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపురం, రాజంపేట సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. జనసేన తనకు కేటాయించిన అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ సీట్లలో ఒక్క సీటును వదులుకుంటుంది. మొత్తం 30 శాసనసభా స్థానాల్లో 24 సీట్లకు జనసేన, ఆరు సీట్లకు బీజేపీ పోటీచేస్తాయి. పవన్ కల్యాణ్ లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలున్నట్లు చెప్పుతున్నారు. కేంద్రంలో పవన్ కల్యాణ్‌కు మంత్రి పదవి ఇస్తామని బీజేపీ నాయకత్వం చెప్పినట్లు తెలుస్తోంది.
శనివారం అమిత్ షా, చంద్రబాబు మధ్య జరిగిన చర్చల్లో సీట్ల సంఖ్యపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. పొత్తులపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల పేర్లను ఎన్‌డీఏ ఈ నెల 14వ తేదీన ప్రకటించవచ్చునని తెలుస్తోంది.