Telugu Global
Andhra Pradesh

రుషికొండలో 'నరబలి' అంటూ టీడీపీ దిగజారుడు వ్యాఖ్యలు

కేఏ పాల్ వ్యాఖ్యల విశ్వసనీయత ఎంత..? ఆయన ఏమేం మాట్లాడతారనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. అయితే ఆయన మాటల్ని ఎల్లో మీడియా హైలైట్ చేస్తోంది.

రుషికొండలో నరబలి అంటూ టీడీపీ దిగజారుడు వ్యాఖ్యలు
X

రుషికొండపై నిర్మించిన భవనాలను నిన్న వైసీపీ నేతలు ప్రారంభించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఉపయోగించుకుంటారా లేక, టూరిజం రిసార్ట్ ల లాగా వాడుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో రుషికొండ భవనాల ప్రారంభోత్సవంపై టీడీపీ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోంది.

పాల్ పిచ్చిమాటలే ఆధారమా..?

కేఏ పాల్ వ్యాఖ్యల విశ్వసనీయత ఎంత..? ఆయన ఏమేం మాట్లాడతారనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. అయితే ఆయన మాటల్ని ఎల్లో మీడియా హైలైట్ చేస్తోంది. రుషికొండపైకి ఎవర్నీ అనుమతించడంలేదు, అక్కడ నరబలి జరిగిందేమో అని అన్నారు పాల్. ఆ మాటల్ని టీడీపీ అనుకూల సోషల్ మీడియా కూడా వైరల్ చేసింది. ఆ తర్వాత టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా అవే వ్యాఖ్యలు వినిపించాయి.


విశాఖ రాజధాని వ్యవహారంపై టీడీపీ ముందు నుంచీ విషం చిమ్ముతూనే ఉంది. రుషికొండ నిర్మాణాలపై కూడా కోర్టుల్లో కేసులు వేసి ఆలస్యం చేయాలని చూసింది. ఇప్పుడు రుషికొండ రిసార్ట్ ల ప్రారంభోత్సవంపై కూడా విషం కక్కింది. " ప్ర‌జాధ‌నం 500 కోట్లు ఖ‌ర్చుచేసి, రుషికొండకి గుండు కొట్టి, నిబంధ‌న‌ల్నీ ఉల్లంఘించి క‌ట్టిన ప్యాలెస్ చుట్టూ నెల‌కొన్న కోర్టు వివాదాలు, అడ్డంకులు తొల‌గాల‌ని న‌ర‌బ‌లి ఇచ్చిన‌ట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. రుషికొండ ప్యాలెస్‌లోకి ఎవ్వ‌రినీ అనుమ‌తించ‌క‌పోవ‌డంతో ఈ అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి." అంటూ టీడీపీ చేసిన ట్వీట్ పై వైసీపీ మండిపడుతోంది. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు.

First Published:  1 March 2024 9:52 AM IST
Next Story