మళ్ళీ జగనేనా? స్వరాజ్య జోస్యం
గడచిన రెండు ఎన్నికల్లో వైసీపీకి ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, క్రిస్తియన్లే అండగా ఉన్నారని గుర్తు చేసింది. ఈ వర్గాలకు అదనంగా బీసీలు కూడా కలవటం వల్లే వైసీపీకి అంతటి మెజారిటి వచ్చిందని విశ్లేషించింది. రాబోయే ఎన్నికల్లో కూడా పై వర్గాల మద్దతు జగన్‌కే ఉంటుందని జోస్యం చెప్పింది.
దాదాపు ఆరు దశాబ్దాల చరిత్రున్న ‘స్వరాజ్య’ మ్యాగజైన్ వారం రోజుల క్రితం ఏపీ రాజకీయాలపై ఒక స్టోరీ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పింది. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావటానికి దోహదపడిన అంశాలపై విశ్లేషణ చేసిన మ్యాగజైన్ 2024 ఎన్నికల్లో జగన్ విజయానికి సానుకూలంగా ఉండబోయే అంశాలు ఏమిటనే విషయాలను ప్రస్తావించింది. స్వరాజ్య లెక్కల ప్రకారం అఖండ మెజారిటీకి జగన్ అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్‌స్సే కారణం.
రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇదే జగన్‌కు కలిసొచ్చే అంశమని స్వరాజ్య చెప్పింది. గడచిన రెండు ఎన్నికల్లో వైసీపీకి ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, క్రిస్తియన్లే అండగా ఉన్నారని గుర్తు చేసింది. ఈ వర్గాలకు అదనంగా బీసీలు కూడా కలవటం వల్లే వైసీపీకి అంతటి మెజారిటి వచ్చిందని విశ్లేషించింది. రాబోయే ఎన్నికల్లో కూడా పై వర్గాల మద్దతు జగన్‌కే ఉంటుందని జోస్యం చెప్పింది. జూన్ 16వ తేదీన వేణుగోపాల్ నారాయణన్ రాసిన ‘అన్ కవర్డ్ జగన్మోహన్ రెడ్డీస్ సీక్రెట్ ఫార్ముల ఫర్ ఎలక్టోరల్ సక్సెస్ ’ అనే స్టోరీలో అనేక అంశాలను టచ్ చేశారు. నగదు బదిలీ పథకాలే జగన్‌కు పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పారు.
ఏపీలో ముస్లింల జనాభా 16 శాతం ఉందట. ఎస్టీలు 6 శాతం ఉన్నారట. ఎస్సీ+ఎస్టీ+ముస్లిం+క్రిస్టియన్+బీసీల్లోని వర్గాల మద్దతు వల్లే జగన్ రాబోయే ఎన్నికల్లో 50 శాతం ఓటుషేర్‌తో అధికారానికి వచ్చే అవకాశముందని అంచనా వేశారు. జగన్‌కు అతిపెద్ద మద్దతుదారు క్రిస్తియన్లే అని తేల్చేశారు. మొత్తం జనాభాలో క్రిస్టియన్ల జనాభా 35-40 శాతం ఉంటారట. అన్నీ కులాల నుండి క్రిస్టియన్లుగా మారినవాళ్ళు ఎక్కువగా ఉండటంతో క్రిస్టియన్ల జనాభా ఎక్కువగా ఉన్నట్లు నారాయణన్ అభిప్రాయపడ్డారు.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 35-40 శాతం కన్వర్టెడ్ క్రిస్టియన్లున్నారట. అనంతపురం, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖలో 25-30 శాతం ఉంటారట. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 15-20 శాతం క్రిస్టియన్లున్నారని వేణుగోపాల్ చెప్పారు. క్రిస్టియన్లంటే బీసీ-సీ కేటగిరిలోకి వస్తారని కాబట్టే బీసీల్లో కూడా జగన్ మద్దతుదారులు ఎక్కువగా ఉన్నట్లు నారాయణన్ చెప్పారు. మరి స్వరాజ్య జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.