Telugu Global
Andhra Pradesh

రఘురామపై సుప్రీం ఆగ్రహం

పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే పిటిషన్‌ను డిస్మిస్ చేయవద్దని.. తామే వెనక్కు తీసుకుంటామని రఘురామ తరపు న్యాయవాది కోరడంతో అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

రఘురామపై సుప్రీం ఆగ్రహం
X

విశాఖ రుషికొండ విషయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో సానుకూల స్పందన రాలేదు. రఘురామకృష్ణంరాజుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చిందని.. తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించింది. దేశంలో ఎక్కడ ఇంచు భూ వివాదం ఉన్నా సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని నిలదీసింది.

హైకోర్టు మధ్యంతర ఉత్వర్తులు కూడా ఇచ్చినందుకు ఈ దశలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు చెప్పింది. ఏదైనా చెప్పుకోవాలనుకుంటే హైకోర్టులోనే చెప్పండి అని స్పష్టం చేసింది. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే పిటిషన్‌ను డిస్మిస్ చేయవద్దని.. తామే వెనక్కు తీసుకుంటామని రఘురామ తరపు న్యాయవాది కోరడంతో అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పర్యావరణానికి హాని లేకుండా అభివృద్ధి పనులు కొనసాగించాలని చెప్పింది. అధికంగా తవ్వకాలు జరిపారన్న ఆరోపణలపైనా స్పందించిన హైకోర్టు.. ఆ ప్రాంతంలో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించింది. ఇంతలో నిర్మాణాలు చేపట్టకుండా స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు రఘురామ వెళ్లారు.

First Published:  11 Nov 2022 1:28 PM IST
Next Story