ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట..సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు
అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అక్టోబర్ నెలలో కొట్టివేసింది. ఈ క్రమంలోనే అనంతబాబు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
BY Telugu Global12 Dec 2022 5:12 PM IST
X
Telugu Global Updated On: 12 Dec 2022 5:12 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సందర్భంగా బెయిల్ షరతులను మాత్రం కింది కోర్టు విధించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తన మాజీ డ్రైవర్ దళిత వర్గానికి చెందిన వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉంటున్నారు. అయితే బెయిల్ కోసం అనంతబాబు అనేక ప్రయత్నాలు చేశారు. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అక్టోబర్ నెలలో కొట్టివేసింది. ఈ క్రమంలోనే అనంతబాబు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది.
Next Story