Telugu Global
Andhra Pradesh

వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో సునీతారెడ్డి పిటిషన్

వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయాలని ఆయన కూతురు సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు ఏపీలో అనుకూల పరిస్థితులు లేవని ఆమె ఆరోపించారు.

వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో సునీతారెడ్డి పిటిషన్
X

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి మూడేళ్ళు గడిచి పోయింది. కానీ ఆ కేసు విచారణ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసు విచారణకు అనుకూల పరిస్థితులు లేవని అందువల్ల కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఏపీలో కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని సునీత ఆరోపించారు. కేసు విచారణ సందర్భంగా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకని ఈ విచారణను తెలంగాణ హైకోర్టు పరిధిలో జరేగేలా ఆదేశాలివ్వాలని సునీత సుప్రీం కోర్టును కోరారు.

సునీత తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా, వివేకా హత్య కేసు విచారణలో స్థానిక పోలీసులు ఏ మాత్రం సహకరించడంలేదని, నిందితులు బెయిల్ పై బైటికి వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని కోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 14కి వాయిదా వేసింది.

First Published:  19 Sept 2022 2:20 PM IST
Next Story