Telugu Global
Andhra Pradesh

రుషికొండ బిల్డింగ్స్‌ అమ్ముతారా...చంద్రబాబుకు సుఖేష్ లేఖ

ఏపీలో రుషికొండ భవనాలపై కాంట్రవర్సీ కొనసాగుతున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబుకు సుఖేష్‌ చంద్రశేఖర్ లేఖ రాశారు. రుషికొండ ప్యాలెస్ భవనాలను తనకు అమ్మడం లేదా లీజుకు ఇవ్వాలని లేఖలో కోరారు.

రుషికొండ బిల్డింగ్స్‌ అమ్ముతారా...చంద్రబాబుకు సుఖేష్ లేఖ
X

ఏపీలో రుషికొండ భవనాలపై కాంట్రవర్సీ కొనసాగుతున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబుకు సుఖేష్‌ చంద్రశేఖర్ లేఖ రాశారు. రుషికొండ ప్యాలెస్ భవనాలను తనకు అమ్మడం లేదా లీజుకు ఇవ్వాలని లేఖలో కోరారు. మార్కెట్ ధర కంటే 20 శాతం ఎక్కువ చెల్లిస్తానని సుఖేష్‌ చంద్రశేఖర్ ఆఫర్ చేశారు. లేదా ప్రభుత్వం ఎంత ధర ఫిక్స్ చేసినా చెల్లించేందుకు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు సుఖేష్‌. తన లేఖను లెటర్ ఆఫ్ ఇంటెంట్‌గా పరిగణించాలని చంద్రబాబును కోరారు.

తనకు విశాఖతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని లేఖలో పేర్కొన్నారు సుఖేష్. తన గ్రాండ్ మదర్‌ విశాఖకు చెందిన వారని..చిన్నతనంలో చాలాసార్లు విశాఖకు వెళ్లానని అక్కడ బీచ్‌లో ఆడుకున్నానని లేఖలో చెప్పుకొచ్చారు. రుషికొండ చాలా పచ్చదనంతో కూడి అద్భుతంగా ఉండేదన్నారు. ఇప్పుడు ఆ రుషికొండపై వివాదం నడుస్తున్నందున భవిష్యత్తులో ఆ భవనాలను ప్రభుత్వం అమ్మాలనుకున్నా లేదా లీజుకు ఇవ్వాలనుకున్నా తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

తనపై ఉన్న ఏ ఒక్క కేసు కూడా ఇప్పటివరకూ నిరూపణ కాలేదని చెప్పారు సుఖేష్. కేవలం ఆరోపణలు మాత్రమేనన్నారు. తను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ తన వ్యాపారాలన్ని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు సుఖేష్. తన వ్యాపార లావాదేవీలన్ని చాలా పారదర్శకంగా ఉన్నాయన్నారు. చెన్నై,గోవా,దుబాయి, బార్సిలోనాలో తన హోటల్ వ్యాపారం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోందన్నారు. అదే మోడల్‌లో రుషికొండ ప్యాలెస్‌ను డెవలప్ చేసి కామన్‌ మ్యాన్‌కు అందుబాటులో ఉంచుతానన్నారు. ప్రస్తుతం తాను జ్యుడిషియల్ కస్టడీలో ఉండడం వల్ల పరిమితులు ఉన్నాయని..త్వరలోనే తన టీం పూర్తి స్థాయి వివరాలతో కలుస్తారని లేఖలో వివరించారు. 200 కోట్ల రూపాయల మోసం కేసులో ప్రస్తుతం సుఖేష్ చంద్రశేఖర్ తిహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

First Published:  21 Jun 2024 8:00 PM IST
Next Story