ఓ ట్రాన్స్ జెండర్ పోరాటం ఫలించింది
నేను ట్రాన్స్ జెండర్‌ని. నన్ను అలాగే గుర్తించండి అంటూ పోరాడి విజయం సాధించిన గురుమూర్తి అలియాస్ రేణుక స్టోరీ ఇది..
ట్రాన్స్‌జెండర్లు చాలా మంది తమ ఐడెంటిటీని దాచుకోవాలని చూస్తారు. పురుషుడుగా చెలామణి అవుతుంటే అదొక గౌరవంగా భావిస్తారు. స్త్రీగానైనా మర్యాదమన్ననలు దక్కుతాయనుకునేవారు. ఇటీవల కాలంలో చాలా చైతన్యవంతమైన మార్పులు ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీలో వచ్చాయి. హక్కులు దక్కించుకునేందుకు ఉద్యమిస్తున్నారు. వివక్ష ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. నేను ట్రాన్స్ జెండర్‌ని. నన్ను అలాగే గుర్తించండి అంటూ పోరాడి విజయం సాధించిన గురుమూర్తి అలియాస్ రేణుక స్టోరీ ఇది..
శ్రీకాకుళం జిల్లా కేంద్రం రెల్లి వీధికి చెందిన గురుమూర్తి అలియాస్ రేణుక అనే ట్రాన్స్ జెండర్ Successfully fought to change the rice card to transgender instead of men సచివాలయం సిబ్బందిని కోరారు. పత్రాలు అన్నీ సమర్పించినా సాంకేతిక కారణాల వలన రైస్ కార్డులో ట్రాన్స్ జెండర్‌గా నమోదు చేయలేకపోయారు. ఎందుకు ఈ మార్పు అని రేణుకని అడిగితే ``రైస్ కార్డులో పురుషుడు నుంచి ట్రాన్స్ జెండర్‌గా లింగ మార్పిడి జరగటం వల్ల తనకు ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రత్యేక పథకాలలో లబ్ది పొందే అవకాశం ఉంటుంది`` అనే ఆశ ఉందని వివరించారు.
పట్టువదలని గురుమూర్తి అలియాస్ రేణుక తనకు న్యాయం చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు 2022 అక్టోబరులో దరఖాస్తు చేశారు. రేణుక దరఖాస్తు పరిశీలించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సచివాలయ సిబ్బందికి నోటీసు జారీ చేశారు. రేషన్ కార్డులో జెండర్ మార్పు విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది తమ పైఅధికారులతో సంప్రదించారు. మొత్తం ప్రాసెస్ ఆరు నెలలు పట్టింది. ఎట్టకేలకు గురుమూర్తి రేషన్ కార్డులో పురుషుడు కాలమ్ నుంచి ట్రాన్స్ జెండర్‌గా మార్పు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్.సన్యాసినాయుడు సమక్షంలో రేణుకకు రేషన్ కార్డుని అందించారు.