Telugu Global
Andhra Pradesh

జగన్ పై సానుభూతి లేకపోగా ఎల్లో మీడియా విషపు రాతలు..

సెక్యూరిటీ వైఫల్యంగా ఈనాడు పేర్కొంటే, ఆంధ్రజ్యోతి మాత్రం మరీ బరితెగించేసి దాడికి కారణం వైసీపీయే అన్నట్టుగా వార్తలిచ్చింది. కమలాసన్ అంటూ టైటిల్ పెట్టి విషపురాతలు రాసింది.

జగన్ పై సానుభూతి లేకపోగా ఎల్లో మీడియా విషపు రాతలు..
X

అబ్బే అదేం పెద్ద దెబ్బ కాదు, రెండు కుట్లు పడ్డాయంతే..

సీఎంపై దాడి.. ఇదేదో అనుమానంగా ఉంది..

ఘోర భద్రతా వైఫల్యం..

సీఎం జగన్ పై రాళ్లదాడి జరిగిన తర్వాత ఎల్లోమీడియా వండి వార్చిన కథనాలివి. ఏమాత్రం సానుభూతి లేకుండా ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు ప్రజల్లో అనుమానం కలిగేలా కథనాలిస్తున్నారు. సెక్యూరిటీ వైఫల్యంగా ఈనాడు పేర్కొంటే, ఆంధ్రజ్యోతి మాత్రం మరీ బరితెగించేసి దాడికి కారణం వైసీపీయే అన్నట్టుగా వార్తలిచ్చింది. కమలాసన్ అంటూ టైటిల్ పెట్టి విషపురాతలు రాసింది.

సీఎం జగన్ పై జరిగిన దాడికి విపక్షాలని టార్గెట్ చేస్తారేమోనని ముందుగానే భద్రతా వైఫల్యం అంటూ ముద్రవేసే ప్రయత్నం చేసింది ఈనాడు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని సింగ్‌నగర్‌లో వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ వద్ద ఈ దాడి జరిగిందని.. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఎందుకు ఆగిపోయిందని ఈనాడు లాజిక్ తీస్తోంది. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌, సీఎం సెక్యూరిటీ గ్రూపు, క్లోజ్‌ ప్రాక్సిమిటీ గ్రూప్‌, ఎస్కార్ట్‌, ఇన్నర్‌ కార్డన్‌, అవుటర్‌ కార్డన్‌, పెరిఫెరీ ఇలా వందల మంది ముఖ్యమంత్రికి భద్రత ఉన్నా సీఎంపై దాడి ఎలా జరిగిందని ప్రశ్నిస్తోంది ఈనాడు. భద్రతాపరంగా పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని నిందలేస్తోంది. సీఎం బస్సుపై ఎందుకు నిలబడ్డారని, విద్యుత్ సరఫరా ఆపేసినప్పుడు కనీసం ఫోకస్ లైట్లు కూడా ఆన్ చేయలేదని ఈనాడు సందేహం వ్యక్తం చేస్తోంది. అసలు దాడి ఘటనను పక్కనపెట్టి, కొసరుగా లోపాలు వెదకడం మొదలుపెట్టింది ఎల్లో మీడియా

సీఎం జగన్ పై దాడి ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. యాత్ర షెడ్యూల్ ని ముందుగానే ప్రకటించకుండా, ఎక్కడికక్కడ స్థానికంగా బస్సుయాత్ర ప్లాన్ చేస్తూ కేవలం రోజువారీ వివరాలు తెలియజేస్తున్నా ఈ దాడి జరగడం విశేషం. కంటిపై భాగంలో గాయం అయింది కాబట్టి సీఎం జగన్ క్షేమంగా బయటపడ్డారు. అదే కంటికి తగిలినా, నేరుగా కణతకు తగిలినా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ దాడితో యాత్ర రెండు రోజులు వాయిదా పడే అవకాశముంది.

First Published:  14 April 2024 7:20 AM IST
Next Story