ఏపీలో దొంగ ఓట్లు.. విచారణ నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు జడ్జి
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర బెంచ్‌కు ఈ పిటిషన్ రావడంతో ఆయన 'నాట్ బిఫోర్ మీ' పేరుతో విచారణ నుంచి తప్పుకున్నారు.
ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదు చేయించారని.. దీనిపై ఏపీ ప్రభుత్వం యధేచ్చగా జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ పిటిషన్ వేసింది. ఐప్యాక్ మాజీ ఉద్యోగులతో దొంగ ఓట్లు భారీగా చేరుస్తున్నారంటూ సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ బాధ్యుడు, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేశ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర బెంచ్‌కు ఈ పిటిషన్ రావడంతో ఆయన 'నాట్ బిఫోర్ మీ' పేరుతో విచారణ నుంచి తప్పుకున్నారు. తాను గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారని.. అందుకే ఈ పిటిషన్‌ను విచారించలేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని బెంచ్ నుంచి పిటిషన్ వెళ్లిపోయింది. సీజేఐ ఆదేశాలతో పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి కేటాయించాలని రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు.
ఏపీలో ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలు వలంటీర్ల ద్వారా సేకించిన డేటాను ప్రొఫైలింగ్ చేస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకోసం రూ.68 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని నిమ్మగడ్డ తెలిపారు. ఐప్యాక్ మాజీ ఉద్యోగులు చేస్తున్న ఈ వ్యవహారం మొత్తాన్ని పిటిషన్‌లో ఉటంకించారు. ఓటర్ల నమోదులోగ్రామ, వార్డు వలంటీర్లను, కార్యదర్శులను భాగస్వామ్యం చేయడంపై సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.