ఎన్నికల షెడ్యూల్‌పై ఏపీలో ఫేక్ ప్రచారం
ఏపీ సీఈవో పేరుతో ఫేక్ షెడ్యూల్ ప్రచారంలో ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుందటగా.. ఇప్పుడు ఏ నలుగురు కలిసినా ఇదే ముచ్చట. కొంత మంది అయితే అదేంటి ఇంకా రాలేదా..? ఎప్పుడో వచ్చేసిందన్నారు కదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలపై గత రెండు నెలలుగా రాష్ట్రంలో వినిపిస్తున్న వదంతులు వినీవినీ జనం షెడ్యూల్ వచ్చేసిందని ఫిక్సయిపోయారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దు.. ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదని ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం
ఏపీ సీఈవో పేరుతో ఫేక్ షెడ్యూల్ ప్రచారంలో ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు. ఆ ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి నకిలీ షెడ్యూల్ ప్రకటనలు ఇప్పటికే రాష్ట్రంలో చాలాసార్లు జరగడంతో ఎన్నికల అధికారులే పూనుకుని వాటిని ఖండించాల్సి వచ్చింది.