Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుది ప్రచారమే.. జగన్‌ హయాంలో నాలుగింతలు..

చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా, అవి ప్రస్తుతం 5,669కి పెరిగాయి.

చంద్రబాబుది ప్రచారమే.. జగన్‌ హయాంలో నాలుగింతలు..
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ పేరుతో ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. దాంతో స్టార్టప్‌ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా, అవి ప్రస్తుతం 5,669కి పెరిగాయి. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో స్టార్టప్‌ల సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగినట్లు తెలిసిపోతోంది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్‌లకు మెంటార్‌షిప్‌, ఫండింగ్‌, ఇండస్ట్రీ కనెక్ట్‌లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే ఏవిధంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్నోవేషన్‌ సొసైటీ సీఈవో అనిల్‌ తెంటు చెప్పుతున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ-4కు చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలను కూడా కల్పతరువు పేరిట ఏర్పాటు చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏ హబ్‌, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్‌ జోన్‌లోనూ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పలు స్టార్టప్‌లు తయారవుతున్నాయి.

First Published:  10 Feb 2024 4:07 PM IST
Next Story