Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు సభలో తొక్కిసలాట,7గురు మృతి, 4గురి పరిస్థితి విషమం

కందుకూరిలోని ఎన్టీఆర్ సర్కిల్ లో ఈ రోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ బహిరంగసభ నిర్వహించింది. సభా స్థలం పక్కనే పైన ఎటువంటి స్లాబ్ లేని అతి పెద్ద డ్రైనేజీ కాలువ ఉంది. బహిరంగ సభ జరిగిన స్థలం చిన్న‌గా ఉండటం ప్రజలు ఎక్కువమంది రావడంతో ఒకరినొకరు తోసుకోవడంతో దాదాపు 15 మంది డ్రైనేజీ కాలువలో పడి పోయారు.

చంద్రబాబు సభలో తొక్కిసలాట,7గురు మృతి, 4గురి పరిస్థితి విషమం
X

నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు దేశం పార్టీ నిర్వహించిన 'ఇదేంకర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్ షోలో చంద్ర బాబు మాట్లాడుతుండగా తొక్కిసలాట జరిగి 7గురు వ్యక్తులు మరణించగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది

కందుకూరిలోని ఎన్టీఆర్ సర్కిల్ లో ఈ రోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ బహిరంగసభ నిర్వహించింది. సభా స్థలం పక్కనే పైన ఎటువంటి స్లాబ్ లేని అతి పెద్ద డ్రైనేజీ కాలువ ఉంది. బహిరంగ సభ జరిగిన స్థలం చిన్న‌గా ఉండటం ప్రజలు ఎక్కువమంది రావడంతో ఒకరినొకరు తోసుకోవడంతో దాదాపు 15 మంది డ్రైనేజీ కాలువలో పడి పోయారు.

ఆ 15 మందిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రిలో మరో ఐదుగు మరణించినట్టు తెలుస్తోంది. మరో నలుగురు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. మిగతా వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే సభను అర్దాంతరంగా ఆపేసిన‌ చంద్రబాబు ఆస్పత్రికి వెళ్ళారు. టీడీపీ కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయినవారందరినీ ఆస్పత్రికి తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మిగతావారికి కూడా తీవ్రగాయాలవడంతో వారందరికీ వైద్యులు చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని కందుకూరు నుంచి ఒంగోలుకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు.

కాగా చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా తొక్కసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

మరో వైపు ఈ సంఘటన నేపథ్యంలో తెలుగు దేశం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సభ ఏర్పాటు చేసేప్పుడు ఎంత మంది వస్తారు? ఎంచుకున్న సభా స్థలం ఎంత వైశాల్యం ఉంది ? చుట్టు పక్కల పరిస్థితి ఏంటి ? అనేది పట్టించుకోకుండా డ్రైనేజీ పక్కన చిన్న స్థలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సభ నిర్వహించడం బాధ్యరాహిత్యమనే ఆరోపణలు వస్తున్నాయి.

*మృతుల వివరాలు: దేవినేని రవీంద్ర, ఆత్మకూరు, కలవకురి యానాది, కొండమూడుసు పాలెం, యటగిరి విజయ, ఉలవపాడు, కకుమాను రాజా, కందుకూరు, మరలపాటి చినకొండయ్య గుళ్ళపాలెం , పురుషోత్తం , కందుకూరు. కాగా మరొకరిని గుర్తించాల్సి ఉంది

First Published:  28 Dec 2022 8:52 PM IST
Next Story