ఏప్రిల్ 5 నుంచి ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 11న స్వామి వారి కల్యాణం సందర్బంగా సీఎం చంద్రాబు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
BY Raju Asari9 March 2025 4:50 PM IST

X
Raju Asari Updated On: 9 March 2025 4:50 PM IST
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 15 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీడీ ఛైర్మన్ దంపతులతో పాటు, జేఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు. స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా స్వామివారి కల్యాణం నిర్వహించే వేదికను బీఆర్ నాయుడు పరిశీలించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వివిధ శాఖ అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఏప్రిల్ 11న స్వామి వారి కల్యాణం సందర్బంగా సీఎం చంద్రాబు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు.
Next Story