Telugu Global
Andhra Pradesh

తాజా సర్వే.. వైసీపీదే పైచేయి, కూటమికి ఎదురుదెబ్బే

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 46.5 శాతం ఓట్లు పోలవుతాయని చెప్పింది. ఇతరులకు 3 శాతం ఓట్లు పడుతాయని, ఇంత వరకు ఏ నిర్ణయానికి రాని ఓటర్లు 2 శాతం ఉన్నారని ఆ సర్వే స్పష్టం చేసింది.

తాజా సర్వే.. వైసీపీదే పైచేయి, కూటమికి ఎదురుదెబ్బే
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ స్థానాల‌ను సాధిస్తుందని తాజా సర్వే తేల్చింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 48.5 శాతం ఓట్లు వస్తాయని శ్రీ ఆత్మసాక్షి గ్రూప్‌ చేసిన సర్వేలో తేలింది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 46.5 శాతం ఓట్లు పోలవుతాయని చెప్పింది. ఇతరులకు 3 శాతం ఓట్లు పడుతాయని, ఇంత వరకు ఏ నిర్ణయానికి రాని ఓటర్లు 2 శాతం ఉన్నారని ఆ సర్వే స్పష్టం చేసింది.

ఆ సర్వే ప్రకారం.. రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో వైసీపీకి 93 నుంచి 106 స్థానాలు వస్తాయి. టీడీపీ, జనసేన, బిజేపీ కూటమి 50 నుంచి 69 స్థానాలు గెలుచుకుంటుంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 15 నుంచి 17 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 5 నుంచి 8 స్థానాలు వస్తాయి. ఆత్మసాక్షి మార్చిలో చేసిన సర్వేలో కూడా దాదాపు ఇవే ఫలితాలు వచ్చాయి.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా వైసీపీకి 5, కూటమికి 2 స్థానాలు వస్తాయి. 3 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాలుండగా వైసీపీకి 6 సీట్లు, కూటమికి 2 సీట్లు వస్తాయి. ఒక్క స్థానంలో పోటాపోటీ ఉంది. విశాఖపట్నం జిల్లాలో 15 స్థానాలు ఉండగా 6 స్థానాలు వైసీపీ, 5 స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. 4 సీట్లలో పోటాపోటీ ఉంది.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉండగా 8 స్థానాలు వైసీపీకి, 7 స్థానాలు కూటమికి వస్తాయి. 4 స్థానాల్లో హోరాహోరీ పోటీ ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉండగా, వైసీపీకి 7 సీట్లు, కూటమికి 4 స్థానాలు వస్తాయి. 4 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. వీటిలో 8 స్థానాలు వైసీపీకి, 5 స్థానాలు కూటమికి వస్తాయి, 3 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉండగా వైసీపీకి 8 స్థానాలు, కూటమికి 5 స్థానాలు వస్తాయి. 3 స్థానాల్లో పోటాపోటీ ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలున్నాయి. వీటిలో 6 సీట్లు వైసీపీ, 5 సీట్లు కూటమి గెలుచుకుంటాయి. ఒక్క స్థానంలో నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లుండగా 4 వైసీపీ, 3 కూటమి గెలుచుకుంటాయి. 3 చోట్ల హోరాహోరీ పోరు సాగుతోంది.

ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లుండగా, 8 సీట్లు వైసీపీకి, ఒక్క సీటు కూటమికి వస్తాయి. ఒక్క స్థానంలో నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 స్థానాలుండగా, వైసీపీకి 10, కూటమికి 3 స్థానాలు వస్తాయి. ఒక్క స్థానంలో హోరాహోరీ పోరు సాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలుండగా 7 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తాయి. 3 చోట్ల ఇరు పక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 14 కాగా, వీటిలో 10 స్థానాలు వైసీపీ, 3 స్థానాలు కూటమి కైవసం చేసుకుంటాయి. ఒక్క చోట నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది.

First Published:  25 March 2024 4:18 PM IST
Next Story