పీజీఆర్ఎస్ గా మారిన స్పందన
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వెబ్ పోర్టల్ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.
ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు స్పందన అనే ఆన్ లైన్ వేదిక ఉండేది. ప్రజలెవరైనా తమ సమస్యలను సంబంధిత అదికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు ఆ వెబ్ సైట్ లో అర్జీలను, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేస్తారు. ఫిర్యాదుదారులకు ఒక నెంబర్ కేటాయించి, పరిష్కారం దిశగా ఫాలో అప్ చేస్తారు. స్పందన పేరుతో ఇప్పటి వరకు జరుగుతున్న ఈ వ్యవహారాన్ని చంద్రబాబు ప్రభుత్వం పేరుమార్చి కొనసాగించబోతోంది. దీనికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే పేరు పెట్టారు. పీపుల్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టమ్(PGRS)గా దీన్ని మార్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPGRAMS)లో ఇది అంతర్భాగం అవుతోంది.
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వెబ్ పోర్టల్ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్ లలో, మున్సిపల్ కార్యాలయాల్లో, మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ఈ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. వాటి పరిష్కారం దిశగా అక్కడే తొలి అడుగు పడుతుంది.
ప్రభుత్వం ఆదేశముల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం ద్వారా ది.24-06-2024 వ తేది నుండి ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని కమిషనరు శ్రీ కె.దినేష్ కుమార్, ఐ.ఎ.ఎస్., వారు తెలియచేసారు. మార్చి నెలలో #people #rmc #pgrs #complaints pic.twitter.com/ylucmJSzA8
— Rajamahendravaram Municipal Corporation (@RMCoffice) June 24, 2024
గతంలో చంద్రబాబు హయాంలో ఇదే పేరు ఉండగా, జగన్ వచ్చాక ప్రజలకు మరింత చేరువయ్యేలా స్పందన అనే పేరు పెట్టారు. కొన్నాళ్లు జగనన్నకు చెబుదామంటూ ఫోన్ లో కూడా ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక ఈ వ్యవస్థలో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి పాత పేరుని తిరిగి తీసుకొచ్చారు. విధాన పరంగా ఏమైనా మార్పులుంటాయేమో చూడాలి.