Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఎంత సొక్కమో: స్కిల్‌ స్కామ్‌ బాగోతం ఒక్కటి చాలు

యువతకు నైపుణ్య శిక్షణ పేరుతో చంద్రబాబు కోట్లు మెక్కేశారు. తన ప్రభుత్వ హయాంలో సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ కంపెనీలతో రూ.3,356 కోట్ల ఒప్పందం చేసుకున్నారు.

చంద్రబాబు ఎంత సొక్కమో: స్కిల్‌ స్కామ్‌ బాగోతం ఒక్కటి చాలు
X

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే చాలు, తాను సొక్కం అని చెప్పుకుంటాడు. తనకు అవినీతి మరక లేదని అంటాడు. తన నిజాయితీపై చంద్రబాబు వాగాడంబరం చూస్తే డోకులు రాక మానవు. ఆయన తీరుకు తగ్గట్టు ఆయనకు నిత్యం భజన చేస్తూ, వంత పాడుతున్న ఎల్లో మీడియా కూడా అదే చెబుతుంది. అసలు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ బాగోతం చూస్తే చంద్రబాబు ఎంతటి అవినీతి కొండనో మనకు అర్థమవుతుంది.

యువతకు నైపుణ్య శిక్షణ పేరుతో చంద్రబాబు కోట్లు మెక్కేశారు. తన ప్రభుత్వ హయాంలో సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ కంపెనీలతో రూ.3,356 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. ఇందులో 10 శాతం అంటే రూ.371 కోట్లు ప్రభుత్వ వాటా కింద, మిగతావి కార్పోరేట్‌ ఫండు కింద కంపెనీలు ఇస్తాయని చెప్పారు. అయితే, మంత్రివర్గం ఆమోదం లేకుండానే రూ.371.25 కోట్లు విడుదల చేశారు. కానీ, ఆ నిధులు డిజైన్‌ టెక్‌ కింద షెల్‌ కంపెనీలకు వెళ్లాయి. తమతో ఏ విధమైన ఒప్పందం జరగలేదని సీమెన్స్‌ కంపెనీ తెలిపిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సీమెన్స్‌ కంపెనీ చెప్పిన విషయాన్ని గమనిస్తే చంద్రబాబు రూ.371 కోట్లను దారి మళ్లించారని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మొత్తాన్ని షెల్‌ కంపెనీల ద్వారా బినామీల ఖాతాల్లోకి బదలాయించారు.

ఆ మొత్తాన్ని పీవీఎస్పీకి రూ.238.29 కోట్లు, ఏసీఐకి రూ.57.19 కోట్లు, నాలెడ్జ్‌ పోడియంకి 45.28 కోట్లు, ఈటిఎకు రూ.14.12 కోట్లు, పాట్రిక్‌కి 3.13 కోట్లు, భారతీయ గ్లోబల్‌కి రూ.3.13 కోట్లు, ఇన్‌వెబ్‌కి రూ.1.56 కోట్లు, పోలరీస్‌కు రూ.2.2 కోట్లు, కాడెన్స్‌కి రూ.12 కోట్లు, ఇతరులకు రూ.84.5 కోట్లు ఫ‌లహారంలా పంచిపెట్టారు.

టిడిపి, ఎల్లో మీడియా ప్రచారం ఎంత అబద్ధమో, అసలు వాస్తవం ఏమిటో చూద్దాం..

సీమెన్స్‌ కంపెనీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును చేపట్టిందని టీడీపి, ఎల్లో మీడియా చెబుతున్నాయి. అసలు వాస్తవం ఏమిటంటే, తమతో ఏ విధమైన ఒప్పందం జరగలేదని సీమెన్స్‌ కంపెనీ స్వయంగా ప్రకటించింది. నిధులు దారి మళ్లించడానికి చంద్రబాబు సీమెన్స్‌ కంపెనీని వాడుకున్నారు.

ప్రాజెక్టు ఒప్పందంపై చంద్రబాబు ఎక్కడా సంతకం చేయలేదని టీడీపి, ఎల్లో మీడియా అంటున్నాయి. అయితే, చంద్రబాబు 13 చోట్ల డిజిటల్‌ సంతకాలు చేశారు.

నోట్‌ ఫైల్స్‌ను ప్రస్తుత ప్రభుత్వం మాయం చేసిందని బుకాయిస్తున్నారు. అయితే, ఆ నోట్‌ఫైల్స్‌ చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే మాయమయ్యాయి.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ఏ విధమైన ఫ్రాడ్‌ లేదని డిజైన్‌ టెక్‌ ఎండీ చెప్పారని అంటున్నారు. అయితే, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం ప్రధాన సూత్రధారి డిజైన్‌ టెక్‌ ఎండీ ఖన్వేల్కర్‌. ఇప్పటి వరకు డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెందిన రూ.31.30 కోట్ల ఆస్తులను ఈడి జప్తు చేయడమే అందుకు సాక్ష్యం.

స్కిల్‌ స్కామ్‌ను ఆడిట్‌ చేసిన శరత్‌ అండ్‌ అసోసియేట్స్‌ కంపెనీ ఐపీ అడ్రస్‌ జగన్‌ కంపెనీల ఐపీ అడ్రస్‌ను పోలి ఉందని అంటున్నారు. ఒక హోస్ట్‌ వేలాది ఐపీ అడ్రస్‌లను ఇస్తుంది. వేర్వేరు కంపెనీలకు వేర్వేరు అడ్రస్‌లు ఉంటాయి, ఈ విషయాన్ని మరుగుపరిచి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఏ విధమైన అవినీతి కూడా జరగలేదని సెంటర్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సిఐడీటీ) స్పష్టం చేసినట్లు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. నిజానికి, తాము ఏ విధమైన నివేదిక ఇవ్వలేదని, తమ అనుమతి అడగలేదని సిఐడీటీ స్పష్టం చేసింది.

రెండు వ్యవస్థల మధ్య జరిగే ఒప్పందంతో ముఖ్యమంత్రి ప్రమేయం వుండదనే వాదనను ముందుకు తెచ్చారు. అయితే, వ్యవస్థల తప్పిదాలను ముఖ్యమంత్రి నియంత్రించకుండా చంద్రబాబు తానే స్వయంగా సంతకం చేశారు.

నిధులను షెల్‌ కంపెనీలకు దారి మళ్లించినట్లు ఆధారాలు లేవని టీడిపి, ఎల్లో మీడియా అంటున్నాయి. నాలుగు లేయర్లలో డబ్బుల పంపిణీ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి.

First Published:  29 Jan 2024 9:08 AM GMT
Next Story