రాజ్యంగం మార్చ్ పేరుతో షర్మిల పాదయాత్ర
విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహించారు.
విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహించారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అమెరికా న్యూయార్క్‌లో నమోదైన ఆదానీ లంచం కేసులో వైసీపీ అధినేత జగన్ పేరు ప్రస్తావనపై ఆమె సంచలన డిమాండ్ చేశారు. కరెంట్ కొనుగోళ్ల విషయంలో ఎటువంటి దర్యాప్తు లేదన్నారు. అదానీని బీజేపీ కాపాడుతుందన్నారు. ఇప్పటికైనా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. రూ. 1750 కోట్లు లంచం తీసుకుంటే కనీసం విచారణ కూడా చేయరా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ గౌతమ్ అదానీకి, ప్రధాని మోడీకి బయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అమెరికా FBI చెప్పినా దర్యాప్తు చేయడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో వైసీపీ నేతలు రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు శాసన సభకి వెళ్ళాని రాజ్యాంగం చెబుతుంటే.. కానీ వీళ్లు వెళ్లడంలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి పోనీ వాళ్ళు రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రాజ్యాంగం రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని వైఎస్ షర్మిల తెలిపింది. అధికారంలో లేనప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుని మోస్తుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ తన ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.