Telugu Global
Andhra Pradesh

వైఎస్ఆర్ కాదు, వివేకాపైనే భారమంతా..

ఇన్నాళ్లూ షర్మిల తరపున సునీత ప్రచారం చేశారు, ఆమె మాటలు కూడా ఎవరూ నమ్మకపోయే సరికి నేరుగా వివేకా భార్య సౌభాగ్యమ్మను రంగంలోకి దింపారు షర్మిల.

వైఎస్ఆర్ కాదు, వివేకాపైనే భారమంతా..
X

తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత షర్మిల ప్రచారం అంతా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుమీదుగానే జరిగింది. వైఎస్ఆర్ బిడ్డ అంటూ పదే పదే ఆమె చెప్పుకునేవారు. కానీ ఏపీలో ఆమె పోటీ చేసే సమయానికి సీన్ రివర్స్ అయింది. వైఎస్ఆర్ నా తండ్రి అని చెప్పుకోవడం కంటే.. వివేకానందరెడ్డి మా చిన్నాన్న అని చెప్పేందుకే ఆమె ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. తన గెలుపు భారమంతా వివేకా హత్యకేసుపైనే వేశారు షర్మిల.


ఇన్నాళ్లూ షర్మిల తరపున సునీత ప్రచారం చేశారు, ఆమె మాటలు కూడా ఎవరూ నమ్మకపోయే సరికి నేరుగా వివేకా భార్య సౌభాగ్యమ్మను రంగంలోకి దింపారు షర్మిల. షర్మిల తరపున కడపలో సౌభాగ్యమ్మ ప్రచారం చేశారు. "నా గెలుపు కోసం.. నన్ను గెలిపించాలని వచ్చిన వివేకం చిన్నాన్న సతీమణి, చిన్నమ్మ సౌభాగ్యమ్మకి నా ధన్యవాదాలు. వివేకం చిన్నాన్న నన్ను ఎంపీగా చేయాలని అనుకున్నారు. కానీ అది అప్పట్లో జరగలేదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. దానిని మనమందరం సద్వినియోగం చేసుకుని చిన్నాన్న చివరి కోరిక తీర్చాలి. నన్ను ఎంపీగా గెలిపించి రాజన్న రాజ్యం మళ్లీ తీసుకువద్దామని కడప ప్రజలకు పిలుపునిచ్చిన చిన్నమ్మకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అంటూ చెప్పుకొచ్చారు షర్మిల.

వైఎస్ఆర్ వారసుడిగా కేవలం జగన్ ని మాత్రమే ఆయన అభిమానులు గుర్తిస్తున్నారు. తండ్రిపేరు చెప్పుకుని షర్మిల ఓట్లు అడిగినా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ విషయం తెలుసుగనకే షర్మిల కూడా కడప ఎన్నికల్లో తండ్రి పేరు పక్కనపెట్టారు. కేవలం వివేకా హత్యకేసుని హైలైట్ చేస్తూ, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో అవసరానికి తగ్గట్టు తండ్రిపేరు, ఏపీలో సమయానికి తగ్గట్టు చిన్నాన్న పేరు ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతున్నారు షర్మిల. ఈ డబుల్ గేమ్ ని కడప వాసులే కాదు, రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ కి చోటు లేదని, ఆ పార్టీ టికెట్ పై పోటీచేసేది ఎవరైనా ప్రజలకు అవసరం లేదని అంటున్నారు.

First Published:  10 May 2024 11:07 AM IST
Next Story