ఇలాంటి బీజేపీ నేతలే చంద్రబాబు అదృష్టమా?
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను చూసి పవన్ కలతచెందారట. అందుకనే చంద్రబాబుతో భేటీ అయ్యారని సత్యకుమార్ చెబుతున్నారు. ఒకవైపు టీడీపీతో పొత్తును రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుతో పాటు ఢిల్లీలోని ఏపీ ఇన్‌చార్జిలు పదేపదే వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబుతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశమేలేదని సందర్భం వచ్చినపుడల్లా ప్రకటిస్తున్నారు.
దశాబ్దాలుగా.. మరీ గడచిన పదేళ్ళల్లో బీజేపీ ఏపీలో ఎదుగుబొదుగు లేకుండా ఎందుకుండిపోయిందో అందరికీ ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన సత్యకుమార్.. జాతీయ కార్యదర్శి హోదాలో ఢిల్లీలో ఉంటారు. ఈయనెవరో రాష్ట్రంలో చాలామందికి తెలియదు. గ్రౌండ్ లెవల్లో ఈయనకు ఎలాంటి బలం లేకపోయినా ఢిల్లీ నేతల ప్రాపకం వల్ల పదవులు తెచ్చేసుకున్నారట. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి మాట్లాడుకోవటంలో తప్పేమీలేదన్నారు.
ఇద్దరు నేతలు కలిసి మాట్లాడుకోవటం ప్రజాస్వామ్యంలో తప్పేముందని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను చూసి పవన్ కలతచెందారట. అందుకనే చంద్రబాబుతో భేటీ అయ్యారని సత్యకుమార్ చెబుతున్నారు. ఒకవైపు టీడీపీతో పొత్తును రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుతో పాటు ఢిల్లీలోని ఏపీ ఇన్‌చార్జిలు పదేపదే వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబుతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశమేలేదని సందర్భం వచ్చినపుడల్లా ప్రకటిస్తున్నారు.
మిత్రపక్షంగా ఉన్న పవన్ తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో భేటీ కావటం సత్యకుమార్‌కు తప్పుగా అనిపించలేదు. చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా నరేంద్ర మోడీ, అమిత్ షా మాట్లాడటానికి కూడా ఇష్టపడటంలేదు. చంద్రబాబు తరఫున రాయబారం చేస్తున్నారన్న అనుమానంతోనే పవన్‌కు మోడీ, అమిత్ అపాయిట్మెంట్ కూడా ఇవ్వటంలేదని పార్టీలో టాక్ వినిపిస్తోంది. అలాంటి చంద్రబాబుతో మిత్రపక్షం అధినేత పవన్ భేటీ అవ్వటాన్ని మామూలుగా అయితే సత్యకుమార్ నిలదీయాలి.
మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటమికి పవన్ కూడా కారణమే అని ఉత్తరాంధ్ర బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవ్ బహిరంగంగా ఆరోపించారు. దానికి పవన్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. సొంతపార్టీ అభ్యర్థి ఓటమికి కారకుడైన పవన్‌పై సత్యకుమార్‌కు ఎలాంటి కోపం రాలేదు. నిజంగా ఇలాంటి నేతలు బీజేపీలో ఉండటమే టీడీపీ చేసుకున్న అదృష్టం. టీడీపీలో నుండి బీజేపీలోకి వెళ్ళిన వలస నేతలు, ఒరిజినల్ బీజేపీ నేతల్లో కొందరు టీడీపీ కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇక బీజేపీ ఎప్పటికి బలపడేను? బీజేపీకి ఓట్లు ఎవరేస్తారు?