మార్చి నెలంతా సంక్షేమ పథకాల జాతర
ఈ నెలలో ప్రభుత్వం ఏకంగా 5 సంక్షేమ పథకాలను అమలు చేయబోతోంది. ఇంతకు ముందు మాదిరిగానే ఒక్కో పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో జగన్ బటన్ నొక్కి డబ్బులు వేయబోతున్నారు.
BY Telugu Global1 March 2024 3:50 PM IST
X
Telugu Global Updated On: 1 March 2024 3:50 PM IST
సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకెళుతున్న వైసీపీ ప్రభుత్వం మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఏ క్షణమైనా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సంక్షేమ పథకాల పంపిణీని వేగవంతం చేసింది. ఈ నెలంతా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేయడానికి ప్రణాళిక రూపొందించింది.
విద్యాదీవెనతో మొదలుపెట్టి 5 పథకాలు
ఈ నెలలో ప్రభుత్వం ఏకంగా 5 సంక్షేమ పథకాలను అమలు చేయబోతోంది. ఇంతకు ముందు మాదిరిగానే ఒక్కో పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో జగన్ బటన్ నొక్కి డబ్బులు వేయబోతున్నారు. ఇందుకోసం 5 జిల్లాల్లో సభలు నిర్వహించనున్నారు.
ఈ నెలలో సంక్షేమ పథకాల షెడ్యూల్ ఇదీ
- మార్చి 01- విద్యా దీవెన (కృష్ణా జిల్లా)
- మార్చి 05 - రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ
- మార్చి 07 - వైఎస్సార్ చేయూత (అనకాపల్లి జిల్లా)
- మార్చి 15 - వైఎస్సార్ ఈబీసీ నేస్తం (నంద్యాల జిల్లా)
- మార్చి 19 - జగనన్న వసతి దీవెన (నెల్లూరు జిల్లా)
Next Story