Telugu Global
Andhra Pradesh

సంక్రాంతి సెలవులు ఎందుకు పొడిగించారంటే..

అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతికి ముందుగా 6రోజుల పాటు సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. జనవరి 11వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు సెలవులని నిర్ణయించారు.

సంక్రాంతి సెలవులు ఎందుకు పొడిగించారంటే..
X

ఏపీలో సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు పొడిగించారు. పాఠశాలలు ఈనెల 22 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఘ‌నంగా జ‌రుపుకునే ముఖ్యమైన పండగ‌ల్లో సంక్రాంతి ఒకటి. పండగ కోసం మెజారిటీ జనం పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళ్తుంటారు. ఏపీలో చాలామంది ఇంకా పండగ సంబరాల్లో నుంచి బయటకు రాలేదు.

అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతికి ముందుగా 6రోజుల పాటు సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. జనవరి 11వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు సెలవులని నిర్ణయించారు. దీనిపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు తెలిపాయి. గతంలో సంక్రాంతి సెలవులు కనీసం 10 రోజులు ఉండేవని.. సెలవులు తగ్గించడం కరెక్ట్ కాదని విద్యామంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. సంక్రాంతి సెలవులు జనవరి 9 నుంచి 18వ తేదీ వరకని నిర్ణయించింది. 19వ తేదీన పాఠశాలలు మళ్లీ ప్రారంభం అవుతాయని తెలిపింది.

అయితే పండుగ అయిపోయిన వెంటనే పిల్లలు స్కూళ్లకు రాలేరని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు వచ్చాయి. దీంతో మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

First Published:  18 Jan 2024 7:25 AM IST
Next Story