Telugu Global
Andhra Pradesh

పెట్టుబడులు వస్తే ఓర్వలేకపోతున్నారు: విపక్షాలపై సజ్జల ఫైర్

బుధవారంనాడు తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామికీక‌ర‌ణ‌కు త‌మ ప్రభుత్వం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌న్నారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు జారీ చేస్తున్న విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం సంతోషకరమన్నారు. రివర్స్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను పరిశ్రమల కింద పరిగణించినట్టుగా సజ్జల తెలిపారు.

పెట్టుబడులు వస్తే ఓర్వలేకపోతున్నారు: విపక్షాలపై సజ్జల ఫైర్
X

ఆంధ్రప్రదేశ్ లో జ‌రుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలతో ప్ర‌జ‌లు సంతోషంగా ఉండ‌డాన్ని విప‌క్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయ‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌స్లుంటే చూసి త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు రాక‌పోతే రాలేదని విమర్శలు, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు పెట్టుబ‌డులు వ‌స్తుంటే ఓర్వ‌లేక విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు.

బుధవారంనాడు తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామికీక‌ర‌ణ‌కు త‌మ ప్రభుత్వం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌న్నారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు జారీ చేస్తున్న విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం సంతోషకరమన్నారు. రివర్స్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను పరిశ్రమల కింద పరిగణించినట్టుగా సజ్జల తెలిపారు.

నిబంధనల మేర‌కు ప్రభుత్వం పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే వెనక్కు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేవారంతా జ‌గ‌న్ కు బంధువ‌ల‌నే ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆఖ‌రికి ఆదానీ కూడా ముఖ్య‌మంత్రి బంధువేన‌నే విధంగా మాట్లాడుతున్నార‌న్నారు.

విపక్షాలకు ఎల్లో మీడియా తోడైందన్నారు. బరి తెగించి తప్పుడు రాతలు రాస్తున్నారని విమ‌ర్శించారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు పద్దతి లేకుండా అనుమతులు జారీ చేసిందని ఆయన విమర్శించారు. వారి ప్రభుత్వ హయంలో ఏం చేశారో మర్చిపోయి తమ ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడన్నారు. జ‌గ‌న్ అర్జంటుగా కుర్చీ దిగిపోయి చంద్ర‌బాబుకు అప్ప‌చెప్పాల‌న్న‌ట్టుగా విప‌క్షాల ధోర‌ణి ఉంద‌ని ఎద్దేవా చేశారు.

First Published:  14 Dec 2022 5:21 PM IST
Next Story