Telugu Global
Andhra Pradesh

మళ్లీ కేసీఆర్, మళ్లీ జగన్.. రుద్రకరణ్ క్లారిఫికేషన్

ప్రముఖ జ్యోతిష్యుడు రుద్రకరణ్ ఏపీ విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఏపీలో తిరిగి జగన్ అధికారంలోకి వస్తారని ట్వీట్ చేశారు.

మళ్లీ కేసీఆర్, మళ్లీ జగన్.. రుద్రకరణ్ క్లారిఫికేషన్
X

ప్రధాని నరేంద్రమోదీ బలంగా నమ్మే ప్రముఖ జ్యోతిష్యుడు రుద్రకరణ్ ప్రతాప్ తెలుగు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తు తేల్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉంటాయనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. మే-27న తెలంగాణ రాజకీయంపై హింట్ ఇచ్చారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని, ఆయన మరోసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు. తాజాగా ఆయన ఏపీ విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఏపీలో తిరిగి జగన్ అధికారంలోకి వస్తారని ట్వీట్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం జగన్ హవా కొనసాగుతుందని, ఆయనే తిరిగి ఏపీకి ముఖ్యమంత్రి అవుతారన్నారు.


చెప్పాడంటే.. జరుగుతుందంతే..

చెప్పాడంటే, చేస్తాడంతే.. అనేది ఏపీ సీఎం జగన్ గురించి ఆయన అభిమానులు చెప్పే మాట. అలాగే రుద్రకరణ్ కి కూడా దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్న వయసులోనే జ్యోతిష్యంలో అందరి మన్ననలు పొందారు రుద్రకరణ్. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆయన్ను ట్విట్టర్లో ఫాలో అవుతారంటే రుద్రకరణ్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీల మెప్పు కోరుకోరు, నిర్మొహమాటంగా తనకు అనిపించిందే చెబుతారు రుద్రకరణ్.


బీజేపీలో గుబులు..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. అయితే వారి నాయకుడు మోదీ అమితంగా నమ్మే జ్యోతిష్యుడు రుద్రకరణ్ మాత్రం అది అసాధ్యం అని తేల్చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ దే విజయం అన్నారు. ఇటు ఏపీలో కూడా బీజేపీ కానీ, వారి కూటమి కానీ అధికారంలోకి వచ్చేది లేదని తేల్చేశారు. ఏపీలో జగన్ దే విజయం అంటున్నారు. రుద్రకరణ్ ట్వీట్లతో ఏపీలో వైసీపీ నాయకులకు కొత్త ఉత్సాహం వచ్చింది.

First Published:  3 Jun 2023 1:57 PM IST
Next Story