Telugu Global
Andhra Pradesh

నా ఏడుపే నీకు శాపం..

మంత్రి రోజా కాస్త వెరైటీగా స్పందించారు. గతంలో తాను ఏడుస్తున్న వీడియోని ట్వీట్ చేస్తూ, తన ఏడుపే చంద్రబాబుకి శాపంగా తగిలిందని పరోక్షంగా కౌంటర్లిచ్చారు.

నా ఏడుపే నీకు శాపం..
X

చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నాయకులు తలోరకంగా స్పందిస్తున్నారు. అవినీతికి పాల్పడి నచంద్రబాబు అరెస్ట్ సక్రమమేనని కొందరు అంటుంటే అది అనివార్యం అని మరికొందరు మంట పెడుతున్నారు. మంత్రి రోజా కాస్త వెరైటీగా స్పందించారు. గతంలో తాను ఏడుస్తున్న వీడియోని ట్వీట్ చేస్తూ, తన ఏడుపే చంద్రబాబుకి శాపంగా తగిలిందని పరోక్షంగా కౌంటర్లిచ్చారు.


కర్మ సిద్ధాంతం:

“ఎవడెలా చేసుకుంటాడో! అతడు దాని ఫలితాన్ని అలాగే అనుభవిస్తాడు" అంటూ తన ట్వీట్ కి కామెంట్ జతచేశారు రోజా. చంద్రబాబు అరెస్ట్ వార్తలొస్తున్న దగ్గర్నుంచి రోజా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. వరుస ట్వీట్లతో ఆమె తన కసి అంతా ట్విట్టర్లో బయటపెట్టారు. కర్మ సిద్ధాంతం ఎవడినీ వదిలిపెట్టదు, చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని ఈ విషయంపై తొలి ట్వీట్ వేశారు రోజా. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ సెక్షన్లన్నిటినీ ట్వీట్ లో వివరించారు.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ నిరసనపై కూడా మంత్రి రోజా సెటైరిక్ గా స్పందించారు.

మీ డాడీ...కేడీ కాబట్టే అరెస్ట్ అయ్యాడు పిల్ల సైకో

మంచోడు కాదు సూట్ కేస్ కంపెనీలతో ముంచేసినోడు మీ నాన్న.

కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాని జైలుకి పంపక.. జైలర్ సినిమాకి పంపిస్తారా?

పప్పూ.. మీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే 'ఈకుంభకోణంలో విచారణ జరుపుకోండి..' అని ధైర్యంగా చెప్పు..!!

చంద్రబాబుని ఇక ఏ దేవుడు కాపాడలేడు.. మీ తాత ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుంది.. అంటూ లోకేష్ కి కౌంటర్ ఇచ్చారు. బై బై తుప్పు... బై బై పప్పు అంటూ ఘాటు కామెంట్లు చేశారు. తాజాగా తన ఏడుపు వీడియోని జతచేసి కర్మఫలం అంటూ బాబుపై విరుచుకుపడ్డారు.

First Published:  10 Sept 2023 12:48 PM GMT
Next Story