టీడీపీ వ్యూహకర్త చేతులెత్తేశారా?
గడపగడపకు మన ప్రభుత్వానికి కౌంటరుగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని టేకప్ చేస్తే అది ఫెయిలైంది. ఆఫీసులో కూర్చుని తాను ఎన్నివ్యూహాలు పన్నినా క్షేత్రస్ధాయిలో అమలుచేయాల్సింది నేతలే అన్న విషయం శర్మ మరచిపోయారేమో. నేతల మద్దతు లేకుండా శర్మ ఎన్ని వ్యూహాలు రచించినా సక్సెస్ కాదు.
పార్టీలో జరుగుతున్నది, తగులుతున్న ఎదురుదెబ్బలు చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావటమే టార్గెట్‌గా చంద్రబాబునాయుడు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు పెద్దగా ఫలించటం లేదు. దాంతో వ్యూహకర్త రాబిన్ శర్మతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలకు ముందే శర్మ వ్యూహకర్తగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే శర్మ వ్యూహాలు పార్టీకి ఏ విధంగా కూడా ఉపయోపడటంలేదని అర్ధమవుతోంది.
తాజాగా బాదుడే బాదుడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిన విషయమే ఉదాహరణ. అలాగే ఇదేం ఖర్మ అనే కార్యక్రమంపై పేలుతున్న సెటైర్లు కూడా పార్టీని ఇరకాటంలో పడేసింది. తిరుపతి ఉపఎన్నికలో క్లస్టర్లన్నారు, పోలింగ్ బూత్ కేంద్రం ఒక యూనిట్ అన్నారు, కొన్ని యూనిట్లకు ఒక ఇన్‌చార్జ్ అన్నారు. అయితే ఏమి చేసినా చివరకు ఏదీ వర్కవుట్ కాలేదు. ఉపఎన్నికలో వైసీపీనే గెలిచింది. ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీడీపీ అసలు పోటీనే చేయలేదు.
ఇక ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచేందుకు ఎన్నివ్యూహాలు పన్నుతున్నా ఉపయోగం లేకుండాపోతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న గడపగడపకు వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో బాగా వ్యతిరేకత ఉందని చెప్పేందుకు శర్మతో పాటు ఎల్లో మీడియా కూడా బాగా కష్టపడింది. అయితే ఉపయోగం లేకపోయింది. కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం జనాల్లో తిరుగుతునే ఉన్నారు. జనాలకు ప్రభుత్వం చేస్తున్న మేళ్ళని వివరిస్తునే ఉన్నారు. దాంతో జనాలు కూడా కన్వీన్స్ అవుతున్నారు.
గడపగడపకు మన ప్రభుత్వానికి కౌంటరుగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని టేకప్ చేస్తే అది ఫెయిలైంది. ఆఫీసులో కూర్చుని తాను ఎన్నివ్యూహాలు పన్నినా క్షేత్రస్ధాయిలో అమలుచేయాల్సింది నేతలే అన్న విషయం శర్మ మరచిపోయారేమో. నేతల మద్దతు లేకుండా శర్మ ఎన్ని వ్యూహాలు రచించినా సక్సెస్ కాదు. పార్టీ నివేదిక ప్రకారమే బాదుడే బాదుడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్. ఇక ఇదేం ఖర్మంటు ప్రకటించిన కార్యక్రమంపై రివర్సులో చంద్రబాబును ఉద్దేశించే సెటైర్లు పేలుతున్నాయి. దాంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడమే అనుమానమైపోయింది. జనాల్లో టీడీపీకి ఆదరణ లేనపుడు ఎంత మంది రాబిన్ శర్మలు పనిచేసినా ఉపయోగం ఉండదని చంద్రబాబు తెలుసుకోలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.