Telugu Global
Andhra Pradesh

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ను అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడేప్రాణాలు కోల్పోయారు.

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
X

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ను అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడేప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్ తో పాటు మరో నలుగురు బస్సులోని ప్రయాణికులు ఉన్నారు.

బాపట్ల జిల్లా చిన్నాగంజం నుంచి హైదరాబాదుకు బయలు దేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, చిలకలూరిపేట మండలం ఈవూరి వారి పాలెం డొంక సమీపంలో ఒక టిప్పర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి తమ ఉద్యోగాల కోసం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం - పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా కంకరతో వచ్చిన టిప్పర్‌, బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు చెలరేగి బస్సు దగ్ధం అయ్యింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు సజీవ దహనం కాగా… మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సులో నుంచి క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీకర వాతావరణం నెలకొంది. వెంటనే స్థానికులు ఈ ప్రమాదంపై 108, పోలీసులకు స చారం అందించారు. వెంటనే వారంత అక్కడికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు.

బస్ డ్రైవర్, డ్రైవరు సీటు వెనుకున్న బెర్తులో పడుకున్న వ్యక్తి చనిపోయినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గురైన లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్ బస్ చీరాలకు చెందునదిగా గుర్తించారు. ప్రమాదంలో చనిపోయిన ఓనర్ కమ్ డ్రైవర్ అంజీ ప్రమాద సమయంలో కండీషన్లపై పోలీసుల ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఏడుగురికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐదుగురికి చికిత్స చేసి ఇంటికి పంపించిన వైద్యులు.. మరో ఇద్దరు క్షతగాత్రులకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బైపాస్‌ పనులు జరుగుతుండటంతో.. తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోయి ఉందని , టిప్పర్‌ అతి వేగంతో దూసుకురావడంతో టిప్పర్‌ డ్రైవర్ కంట్రోల్ చేయలేక బస్సును ఢీకొట్టినట్లు ప్రాధమిక సమాచారం.


First Published:  15 May 2024 9:48 AM IST
Next Story