కాకినాడ జిల్లాలో ఘోరం.. నలుగురి ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సు
మరమ్మతులు చేస్తున్న లారీ సిబ్బందిని వైజాగ్ నుంచి రాజమండ్రి వెళుతున్న ఆర్టీసీ బస్సు నేరుగా వచ్చి ఢీకొట్టింది. అటుగా వెళుతున్న మరో వ్యక్తినీ ఢీకొట్టింది.
కాకినాడ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు విధ్వంసం సృష్టించింది. ప్రత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి వద్ద రోడ్డు మీద నిలబడిన నలుగురు మనుషులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ నలుగురూ అక్కడికక్కడే మృతిచెందారు.
టైరు పంక్చరవడంతో ఆగిన లారీ
సోమవారం తెల్లవారుజామున ఒడిశా నుంచి వెళుతున్న ఓ లారీ టైర్ పంక్చర్ కావడంతో ప్రత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి వద్ద రోడ్డుపై ఆగిపోయింది. దానికి మరమ్మతులు చేస్తున్న లారీ సిబ్బందిని వైజాగ్ నుంచి రాజమండ్రి వెళుతున్న ఆర్టీసీ బస్సు నేరుగా వచ్చి ఢీకొట్టింది. అటుగా వెళుతున్న మరో వ్యక్తినీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురూ అక్కడికక్కడే చనిపోయారు. మృతులందరూ నక్కబొక్కలపాడు వారే.
ఆపకుండా వెళ్లిపోయిన ఆర్టీసీ డ్రైవర్
ప్రమాదం తర్వాత బస్సును ఆపకుండా డ్రైవర్ నేరుగా రాజమండ్రి తీసుకెళ్లిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను గుర్తించారు.