పవన్ తన ఫ్యాన్స్‌ని, కాపుల్ని వెన్నుపోటు పొడిచాడు.. ఆర్జీవీ వివాదాస్పద కామెంట్స్
పవన్ కళ్యాణ్ సొంత ఫ్యాన్స్ నే కాకుండా, కాపుల్ని చివరికి తనని తానే వెన్నుపోటు పొడి చేసుకున్నాడని వర్మ చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది. అతడు చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఎప్పుడు వివాదాలతో సహవాసం చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై నోరు పారేసుకున్నాడు. అతడు పవన్‌పై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాన్ని సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సొంత ఫ్యాన్స్ నే కాకుండా, కాపుల్ని చివరికి తనని తానే వెన్నుపోటు పొడి చేసుకున్నాడని వర్మ చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది. అతడు చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నిన్న పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయితేనే పొత్తుకు అంగీకారం తెలపాలని సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ 137 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానమే దక్కింది. కనీసం జనసేనకు 30 నుంచి 40 స్థానాలు వచ్చి ఉంటే ఇవాళ మన పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బలంగా వాదించడానికి అవకాశం ఉండేది' అని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో పవన్ తన వ్యాఖ్యల ద్వారా ముఖ్యమంత్రి పదవి ఆశించడం లేదని నేరుగా చెప్పేశారని వర్మ విమర్శించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుసగా పవన్‌ను విమర్శిస్తూ పోస్ట్‌లు చేశాడు. 'పవన్ తన సొంత ఫ్యాన్స్ నే కాకుండా, కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడు. ఆ రోజు చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈరోజు పవన్ కళ్యాణ్ తన జన సైనికులని, తన ఫ్యాన్స్ ని వెన్నుపోటు పొడిచి చంపేశాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి.' అని వర్మ ట్వీట్ చేశాడు.
తన సొంత ఫ్యాన్స్ నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడు. https://t.co/YqSzrhuPHX
— Ram Gopal Varma (@RGVzoomin) May 11, 2023
ఈ మాత్రం దానికి నీకో పార్టీ, పిడికిలి, ఎర్ర కండువాలు, చేగువేరాలు ' అంటూ మరో సెటైరికల్ ట్వీట్ చేశాడు. వర్మ పవన్‌ను విమర్శిస్తూ వరుసగా చేసిన ట్వీట్స్ తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. వర్మపై తిట్ల దండకం అందుకున్నారు. అధికార పార్టీ నుంచి ఎంత ప్యాకేజీ ముట్టిందని వర్మను ఏకిపడేశారు. ఏ రోజు ఓటు కూడా వేయని నువ్వు పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తున్నావా? అంటూ మండిపడ్డారు.