ఇది వరకు స్పందిస్తే చంద్రబాబు తిట్టారు- బుద్దా వెంకన్న
కేశినేని కార్యాలయం మీద కూడా తన బొమ్మ లేదన్నారు. చంద్రబాబుకు మాట ఇచ్చాను కాబట్టే కేశినేని నాని మాటలపై స్పందించడం లేదన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎన్ని విమర్శలు చేసినా తాను స్పందించబోనన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఇది వరకు ఒకసారి స్పందించగా చంద్రబాబు తమను తిట్టారని.. దాంతో ఇకపై పార్టీకి ఇబ్బంది తెచ్చే అంశాలపై మాట్లాడబోనని చంద్రబాబుకు మాట ఇచ్చానన్నారు. అందుకే పదేపదే తన పేరు తీసి మరి కేశినేని నాని అవమానిస్తున్నా మౌనంగా ఉంటున్నానని వివరించారు. అంతే తప్ప ఎవరికో భయపడి కాదన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి చంద్రబాబు కాకపోతే మరొకరు ఇచ్చే వారని అనే వ్యక్తిని తాను కాదన్నారు. చంద్రబాబు కాబట్టే తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని భావిస్తానన్నారు.
బుద్దా వెంకన్న బయటకు వెళ్తే 10 మంది గుర్తు పడుతున్నారంటే అది చంద్రబాబు వల్లేనన్నారు. కేశినేని నాని ఇన్‌చార్జ్‌లను గొట్టంగాళ్లు అన్నారని, తానేమీ ఇన్‌చార్జ్ పదవిలో లేను కాబట్టి ఆ వ్యాఖ్యలు తన గురించే అనుకోవడం లేదన్నారు.
కేశినేని కార్యాలయం మీద కూడా తన బొమ్మ లేదన్నారు. చంద్రబాబుకు మాట ఇచ్చాను కాబట్టే కేశినేని నాని మాటలపై స్పందించడం లేదన్నారు. ఎన్‌ఎస్‌జీని తీసేసి చంద్రబాబు బయటకు వస్తే ఫినిష్ అయిపోతాడని స్పీకర్ తమ్మినేని మాట్లాడుతున్నారని.. అంటే భద్రత లేకపోతే చంద్రబాబును చంపేసేందుకు ఏమైనా కుట్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు.
తమ నాయకుడు భద్రత లేకుండా బయటకు వస్తారని.. జగన్, స్పీకర్ తమ్మినేని కూడా గన్‌మెన్లు లేకుండా బయటకు రావాలని బుద్దా సవాల్ చేశారు. స్పీకర్ అంటే ఏమైనా మాట్లాడొచ్చు.. తిరిగి ఆయన్ను ఏమీ అనకూడదు అంటే కుదరదన్నారు.
స్పీకర్ కేవలం అసెంబ్లీ హాల్‌లో టీచర్ లాంటివ్యక్తి మాత్రమేనన్నారు. జగన్‌మోహన్ రెడ్డి హఠాత్తుగా గుడివాడ పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం అనివాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతోనే గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపించారు.