Telugu Global
Andhra Pradesh

పవన్ ఫ్యాన్స్‌పై రేణూ దేశాయ్ మండిపాటు

జంతు సంరక్షణ కోసం రేణూ దేశాయ్ ఇటీవల విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందించిన ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ 'మా పవన్ కళ్యాణ్ అన్నయ్యలా గోల్డెన్ హార్ట్ ' అని రేణూ దేశాయ్ పోస్ట్ కు కామెంట్ పెట్టాడు.

పవన్ ఫ్యాన్స్‌పై రేణూ దేశాయ్ మండిపాటు
X

నటి రేణూ దేశాయ్ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. తనను పదే పదే పవన్ కళ్యాణ్ తో ఎందుకు పోలుస్తారంటూ ఆమె మండిపడ్డారు. కొన్నేళ్లపాటు సహజీవనం చేసిన పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణూ దేశాయ్ ఏదైనా పోస్ట్ పెడితే చాలు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెస్తుంటారు. అలా పవన్ ప్రస్తావన తీసుకురావద్దని ఇప్పటికే రేణూ పలు సార్లు అభిమానులను కోరారు. ఇప్పుడు కూడా అభిమానులకు అదే విజ్ఞప్తి చేశారు.

జంతు సంరక్షణ కోసం రేణూ దేశాయ్ ఇటీవల విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందించిన ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ 'మా పవన్ కళ్యాణ్ అన్నయ్యలా గోల్డెన్ హార్ట్ ' అని రేణూ దేశాయ్ పోస్ట్ కు కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ పై రేణూ స్పందించారు. పదేళ్ల వయసు నుంచే తాను జంతు సంరక్షణ కోసం తన వంతు సాయం చేస్తున్నట్లు చెప్పారు. దానికి.. తన మాజీ భర్తకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

జంతువులపై తాను చూపించే ప్రేమ, కేర్ పవన్ కళ్యాణ్ లో లేవని చెప్పారు. దయచేసి తాను చేసే పనుల గురించి పోస్ట్ పెడితే పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువస్తూ మాత్రం కామెంట్ పెట్టకండని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు. తాను ఈ మాటలు బాధతో అన్నానే గానీ కోపంతో కాదని, అభిమానులు అర్థం చేసుకోవాలని మరో పోస్ట్ పెట్టారు. వ్యక్తిగతంగా తనకు పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. తనని తానుగా చూడాలని ఆమె తన పోస్ట్ లకు కామెంట్ పెట్టే వారిని కోరారు.

First Published:  18 May 2024 2:48 PM GMT
Next Story