ఏపీలో భారీ పెట్టుబడులకు రిలయన్స్ సంసిద్ధత
500 అధునాతన బయో గ్యాస్ ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్
BY Raju Asari12 Nov 2024 6:03 AM GMT
X
Raju Asari Updated On: 12 Nov 2024 6:16 AM GMT
ఏపీలో రూ. 65 వేల కోట్ల పెట్టుబడులు రిలయన్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రియలన్స్ సంస్థ 500 అధునాతన బయో గ్యాస్ ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నది. గత నెలలో ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీలను ముంబయిలో మంత్రి నారా లోకేశ్ కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై అప్పుడే అనంత్ అంబానీ, లోకేశ్ మధ్య అవగాహన కుదిరింది. పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్‌తో ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరగనున్నది. రిలయన్స్‌పెట్టుబడులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.50 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Next Story