Telugu Global
Andhra Pradesh

సింహానివైతే గన్‌మెన్ల కోసం ప్రభుత్వం దగ్గరకు ఎందుకెళ్లావ్ పరిటాల శ్రీరాం ?

టీడీపీ హయాంలో గన్‌మెన్లను తీసేసినా తాను ధైర్యంగా తిరిగినానని.. ఇప్పుడు ధైర్యం ఉంటే శ్రీరాం గన్‌మెన్లను వెనక్కు పంపి తిరగాలని సవాల్ చేశారు.

సింహానివైతే గన్‌మెన్ల కోసం ప్రభుత్వం దగ్గరకు ఎందుకెళ్లావ్ పరిటాల శ్రీరాం ?
X

ఓటమి అన్నది అభ్యర్థి నచ్చకపోవడమో... పార్టీ నచ్చకపోవడం వల్లనే జరుగుతుందని మంగళగిరిలో నారా లోకేష్‌ ఓడిపోవడానికి ఈ రెండింటిలో ఏది కారణమో తండ్రీకొడుకులే చెప్పాలన్నారు వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి. వైఎస్ భారతిపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని తాను ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో... ఐటీడీపీ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

పథకాలపై చర్చ జరిగితే జగన్‌కు తిరుగుండదన్న ఉద్దేశంతోనే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ధైర్యానికి మారుపేరు టీడీపీ కేడర్‌ అని టీడీపీ పత్రికలో రాసుకున్నారని... మరి అంత ధైర్యవంతుడైతే పరిటాల శ్రీరాం ఓడిపోగానే ప్రభుత్వం దగ్గరకు వెళ్లి గన్‌మెన్లను ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో గన్‌మెన్లను తీసేసినా తాను ధైర్యంగా తిరిగినానని.. ఇప్పుడు ధైర్యం ఉంటే శ్రీరాం గన్‌మెన్లను వెనక్కు పంపి తిరగాలని సవాల్ చేశారు.

ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారం చేయడం.. లేదంటే చంపేయడం ఇదే తొలి నుంచి టీడీపీ విధానమన్నారు. ఐటీడీపీపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. బోయ రాజారాం, కురుబ ఈశ్వరయ్యను మూడో కంటికి తెలీకుండా తాను చంపించాను అని టీడీపీ పత్రికలో రాయించారని.. తాను ఇప్పుడే వారితో మాట్లాడానని.. తాము ఇంకా బతికే ఉన్నామని చెబుతున్నారని ప్రకాశ్‌ రెడ్డి వివరించారు. ఇది రాసే వాడికైనా వాళ్లు బతికున్నారా.. చచ్చిపోయారా అన్నది తెలియాలి కదా అని ప్రశ్నించారు.

ప్రకాశ్‌ రెడ్డి టీడీపీ వాళ్ల బొచ్చు కూడా పీకలేరని ఐటీడీపీ వారి పత్రికలో రాశారని.. వారికే బొచ్చు పీకే పని కూడా లేక.. ఇలాంటివి రాస్తున్నారని విమర్శించారు. బురదలో పందులూ బతుకుతున్నాయి.. టీడీపీ వారు బతుకుతున్నారని అంతకుమించి ఏమీ తేడా లేదన్నారు. హైదరాబాద్‌లో పబ్‌లు, క్లబ్‌లు, డ్యాన్స్ బార్లు నడుపుతున్న వ్యక్తి పరిటాల శ్రీరాం అని విమర్శించారు. మేడా చంద్రశేఖర్ గుప్తాను భయపెట్టి ఆస్తులు రాయించుకుంది మీరు కాదా అని పరిటాల కుటుంబాన్ని ప్రశ్నించారు.

First Published:  13 Sept 2022 11:09 AM IST
Next Story