జగన్‌పై కక్షతో నిక్ వుజిసిక్‌ను చులకన చేసిన రామోజీరావు
విద్యారంగంలో ఏపీని ఆదర్శంగా తీర్చి దిద్దుతున్నారని, పాఠశాలల్లో సౌకర్యాల ఏర్పాటు, ఇంగ్లీష్ మీడియంలో బోధన, అమ్మ ఒడి తదితర పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన విజన్ గొప్పది అని నిక్ వుజిసిక్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎవరైనా పొగిడినా, ప్రభుత్వ పథకాలను ప్రశంసించినా ఈనాడు రామోజీరావు తట్టుకోలేకపోతున్నారు. అందుకు తాజా ఉదాహరణ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్‌ను చులకన చేయడమే. యువతకు ప్రేరణ కలిగించే ఉద్దేశంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంగళవారం సాయంత్రం నిక్ వుజిసిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ఓ కాగితం చూసి ఏకబిగిన మూడు నిమిషాలు జగన్ గురించి గొప్పలు చెప్పుకుంటూ పోయారని ఈనాడు తన అక్కసును వెళ్లగక్కింది.
ముఖ్యమంత్రి జగన్ తనకు, దేశానికి, ఎంతో మంది యువతకు ఆదర్శమని, విద్యారంగంలో ఏపీని ఆదర్శంగా తీర్చి దిద్దుతున్నారని, పాఠశాలల్లో సౌకర్యాల ఏర్పాటు, ఇంగ్లీష్ మీడియంలో బోధన, అమ్మ ఒడి తదితర పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన విజన్ గొప్పది అని నిక్ వుజిసిక్ అన్నారు. దీనికి రామోజీరావు వక్రభాష్యం చెబుతూ నిక్ వుజిసిక్‌ను నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. `నిక్ వుజిసిక్‌కూ తప్పని జగన్ భజన` అంటూ తనదైన స్టైల్‌లో ఓ వార్తను ప్రచురించారు. తన ప్రియ శిష్యుడు చంద్రబాబును ఎవరైనా ప్రశంసిస్తే రామోజీరావు ఇదే విధమైన రాతలు రాయిస్తారా..?
నిజానికి, వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన విద్యాసంస్కరణల వల్ల పేదలు, దళితుల పిల్లలు నాణ్యమైన విద్యను అభ్యసించడానికి వీలవుతోంది. సంపన్న వర్గాల పిల్లలతో సమానంగా విద్యను అందుకుని ప్రపంచస్థాయిలో వారితో పోటీ పడే అవకాశం కలుగుతోంది. ఎంతో ముందుచూపుతో మరో పదేళ్లలో దళితులు, పేదలు సాధికారితను సాధించడానికి వీలుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, సంక్షేమ పథకాలను కూడా జగన్ అమలు చేస్తున్నారు. అది సహించలేకనే రామోజీరావు నిక్ వుజిసిక్ మీద కూడా తన కుటిల బుద్ధిని ప్రదర్శించారు.