రోడ్డు వేస్తే కూడా రామోజీరావుకు కంటగింపు
ఈ మూడు గ్రామాల పరిధిలో దాదాపు నాలుగు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి. దాంతో రైతులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో ఈ ప్రాంతానికి సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా రాకపోకలకు వీలు ఉండేది కాదు.
ప్రజల కోసం రోడ్డు వేసినా రామోజీరావుకు కంటగింపుగానే ఉంది. మరీ రంధ్రాన్వేషణ చేసి తప్పుడు అన్వయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏదో రకంగా బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి రూ.30 లక్షలతో రోడ్డు’ అంటూ ఈనాడు ఓ తప్పుడు కూత కూసింది. ఆ రోడ్డు ఎవరి కోసం వేశారు, ఎందుకు వేశారు అనే విషయాన్ని కాస్తా కూడా పట్టించుకోలేదు.
మేదరమెట్ల అనమనమూరు రోడ్డులో అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర ఉపాధి హామీ నిధులతో రెండేళ్ల క్రితం తారు రోడ్డు వేశారు. ఈ రహదారి పరిధిలో కొరిశపాడు మండలం అనమనమూరు, అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామాలున్నాయి. మణికేశ్వరం వద్ద దక్షిణ కాశీగా పేరు గాంచిన శైవక్షేత్రం ఉంది. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
ఈ మూడు గ్రామాల పరిధిలో దాదాపు నాలుగు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి. దాంతో రైతులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో ఈ ప్రాంతానికి సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా రాకపోకలకు వీలు ఉండేది కాదు.
వైవీ సుబ్బారెడ్డి మేదరమెట్ల గ్రామానికి చెందినవారు. దీంతో అనమనమూరు, కొంగపాడు, మణికేశ్వరం గ్రామాల రైతులు, ప్రజలు దారి ఏర్పాటు చేయాలని వైవీ సుబ్బారెడ్డిని గతంలో కోరారు. దాంతో 2005లో మేదరమెట్ల నుంచి అనమనమూరు వరకు సుబ్బారెడ్డి తారురోడ్డు, అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకు గ్రావెల్ రోడ్డును మంజూరు చేయించారు.
రెండేళ్ల క్రితం అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకు తారు రోడ్డు పూర్తి కావడంతో మణికేశ్వరానికి, శైవక్షేత్రానికి వెళ్లే భక్తులకు నాలుగు కిలోమీటర్ల దూరం తగ్గింది. వైవీ సుబ్బారెడ్డి మేదరమెట్లకు చెందినవారు కావడమే పెద్ద తప్పు అన్నట్లు ఈనాడు వార్తాకథనం ఉంది. వైవీ సుబ్బారెడ్డికి 40 ఎకరాలు కూడా లేవు. వంద ఎకరాలున్నాయంటూ రామోజీరావు తప్పుడు రాతలు రాశారు.