రామోజీరావుకు ‘పచ్చ’ కామెర్లు.. ‘నారాయణా’ర్పణం కనిపించలేదా..?
ఒకటి, రెండు తరగతుల్లో సరిపడా పిల్లలు లేక రాష్ట్రవ్యాప్తంగా 118 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయని ఈనాడు ఒక వార్తను అచ్చేసింది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 1,785 పాఠశాలలు మూతపడ్డాయి.
ఈనాడు రామోజీరావుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో జరిగిన ‘నారాయణా’ర్పణం కనిపించడం లేదు. పచ్చ కామెర్ల వాడికి అన్నీ పచ్చగానే కనిపిస్తాయన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నారాయణ, చైతన్య విద్యాసంస్థల కోసం ప్రభుత్వ పాఠశాలలను మూతపడేట్లు చేసిన వైనం ఆయనకు గొప్పగానే కనిపిస్తుంది. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని తన బినామీ సంస్థలుగా ఉన్న నారాయణ, చైతన్య పాఠశాలలను పెంచి పోషించడానికి చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో సాధారణంగా ఇవ్వాల్సిన నిధులును కూడా ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన విషయం రామోజీరావుకు తెలియదంటే నమ్మేవారెవరూ లేరు.
ఒకటి, రెండు తరగతుల్లో సరిపడా పిల్లలు లేక రాష్ట్రవ్యాప్తంగా 118 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయని ఈనాడు ఒక వార్తను అచ్చేసింది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 1,785 పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా పాఠశాలలను తీర్చిదిద్దుతున్న వైఎస్ జగన్.. చంద్రబాబు హయాంలో మూతపడిన ప్రభుత్వ స్కూళ్లను కూడా తిరిగి తెరిపించారు.
మనబడి నాడు-నేడు పథకం ద్వారా వైఎస్ జగన్ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.17,805 కోట్ల వ్యయంతో, మూడు దశల్లో 12 రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో దాదాపు 32 వేల పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలపై జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 73,417 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.