బాబు కళ్లలో ఆనందం కోసం.. కీరవాణి సంచలన వ్యాఖ్యలు
బాబు కళ్లలో ఆనందం కోసమే కీరవాణి అలా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. రామోజీరావుని పొగడటం వరకు ఓకే కానీ.. సందర్భం లేకుండా జగన్ ని విమర్శించడం మాత్రం సరికాదంటున్నారు నెటిజన్లు.

విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభలో ప్రసంగాలు పరోక్షంగా వైసీపీని, జగన్ ని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయి. రాజకీయ నాయకులు విమర్శించారంటే అందులో ఓ అర్థముంది, కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా జగన్ ని టార్గెట్ చేయడం ఇక్కడ విశేషం. ఆస్కార్ గ్రహీత కీరవాణి కూడా రామోజీ రావు సంస్మరణ సభలో రాజకీయాలు మాట్లాడారు. పరోక్షంగా జగన్ పాలనను ఆయన ఘాటుగా విమర్శించారు.
ఏపీ కబంధహస్తాల నుండి బయటపడటం చూసి రామోజీరావు గారు మరణించారు
— బాబు కోసం (@trollycp) June 27, 2024
రామోజీ గారి ఫోటో మా పూజ గదిలో ఉంటుంది
- OSCAR award winner MM Keeravani pic.twitter.com/KI1kus1lrm
కీరవాణి ఏమన్నారు..?
బతికితే రామోజీరావులా బతకాలని తాను గతంలో ఓ వేదికపై చెప్పానని గుర్తు చేసుకున్నారు కీరవాణి. చనిపోయినా కూడా రామోజీరావులా చనిపోవాలని ఇప్పుడు చెబుతున్నానని అన్నారు. రామోజీ, భీష్ముడిలాగా తనువు చాలించారన్నారు. తన మరణాన్ని కూడా వాయిదా వేసి తాను అనుకున్న ఘడియలు వచ్చిన తర్వాతే భీష్ముడు ప్రాణాలు వదిలారని, అలాగే రామోజీ రావు కూడా, తాను ఎంతగానో ప్రేమించిన ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోనుంచి బయటపడటం కళ్లారా చూసి మరణించారన్నారు. రామోజీరావుపై బురదజల్లాలని ప్రయత్నించడం నడినెత్తిపై ఉన్న సూర్యుడిపై రాయి విసరడం లాంటిదేనన్నారు కీరవాణి.
కీరవాణి వ్యాఖ్యల తర్వాత సీఎం చంద్రబాబు చిరునవ్వు చిందించారు. బాబు కళ్లలో ఆనందం కోసమే కీరవాణి అలా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. రామోజీరావుని పొగడటం వరకు ఓకే కానీ.. సందర్భం లేకుండా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రం సరికాదంటున్నారు నెటిజన్లు.