Telugu Global
Andhra Pradesh

కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు.. వర్మ మళ్లీ వేసేశాడు

కాపులు, కమ్మోళ్లు, సేనలు.. ఎన్ని రకాలుగా కూడినా, తీసివేసినా, హెచ్చవేసినా, భాగాహారం చేసినా.. చివరకు ఈస్ నాట్ ఈక్వల్ టు ఓట్లు అంటూ సెటైర్ పేల్చారు.

కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు.. వర్మ మళ్లీ వేసేశాడు
X

ఇటీవల సినిమాలకంటే రాజకీయాలు, అందులోనూ కాపు, కమ్మ రాజకీయాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆమధ్య సీఎం జగన్ ని నేరుగా వెళ్లి కలిసొచ్చిన తర్వాత వర్మ స్ట్రాటజీ పక్కాగా మారిపోయింది. ఆ మాటకొస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతోనే వర్మకు చంద్రబాబుపై ఎలాంటి అభిప్రాయముందే తెలిసిపోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పై కూడా సినిమా తీశారు వర్మ. ఇప్పుడు ఇద్దరికీ ట్విట్టర్లో సినిమా చూపిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తాజా భేటీ తర్వాత వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. “కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాచ్యులేషన్స్ కమ్మోళ్ళు..” అంటూ వర్మ చేసిన ట్వీట్ ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. టీడీపీ, జనసేన నాయకులు ఉమ్మడిగా వర్మని సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు. ఇప్పుడు వారిని మరింత రెచ్చగొట్టేలా ఓ ఈక్వేషన్ చెప్పారు. “కాపులు - కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్ నాట్ = ఓట్లు” అంటూ వెరైటీ ట్వీట్ వేశారు.


చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై వైసీపీ నేతలు మరీ రొటీన్ విమర్శలు చేశారు. ప్యాకేజీ కోసం వెళ్లారంటూ మూకుమ్మడిగా ఒకే మాటపై నిలబడ్డారు. డూడూ బసవన్న అంటూ అంబటి రాంబాబు కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసినా.. అందరికీ భిన్నంగా స్పందించింది మాత్రం రామ్ గోపాల్ వర్మ మాత్రమే. కమ్మోళ్లకి కంగ్రాచ్యులేషన్స్ అంటూ రెండు వర్గాలకూ చురుకు పుట్టేలా ట్వీట్ వేశారు వర్మ. ఆ రెండు వర్గాల మధ్య పెట్రోల్ పోశారు. ఇప్పుడు మరోసారి తన ట్వీట్ అస్త్రాలు బయటకు తీశారు.

కాపులు, కమ్మోళ్లు, సేనలు అనే పదాలతో +, -, x, ÷, = అనే గుర్తులు ఉపయోగిస్తూ వెరైటీ ట్వీట్ వేశారు. చివరకు ఆయన ఈ ఈక్వేషన్లో తేల్చిందేంటంటే.. కాపులు, కమ్మోళ్లు, సేనలు.. ఎన్ని రకాలుగా కూడినా, తీసివేసినా, హెచ్చవేసినా, భాగాహారం చేసినా.. చివరకు ఈస్ నాట్ ఈక్వల్ టు ఓట్లు అంటూ గొప్ప సెటైర్ పేల్చారు. అంటే జగన్ కి వ్యతిరేకంగా కాపు, కమ్మ.. ఏం చేసినా చివరకు వారికి మాత్రం ఓట్లు రాలవు అని తేల్చేశారు రామ్ గోపాల్ వర్మ. మరోసారి ఆ రెండు వర్గాలకు మంటపెట్టారు.

First Published:  10 Jan 2023 7:46 PM IST
Next Story