Telugu Global
Andhra Pradesh

చూడు బేబీ.. లోకేష్‌కు ఆర్జీవీ కౌంటర్‌!

తన జీవితం తెరిచిన పుస్తకమని..లోకేష్‌లాగా ఎక్కడో స్విమ్మింగ్‌ఫూల్స్‌లో అమ్మాయిలతో ఆడిన ఫొటోలు దాచే అవసరం తనకు లేదన్నారు. చంద్రబాబు గారి పరిస్థితిని చూసి లోకేష్‌ మైండ్ పని చేయట్లేదేమో అన్నారు ఆర్జీవీ.

చూడు బేబీ.. లోకేష్‌కు ఆర్జీవీ కౌంటర్‌!
X

సమాజానికి రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేశాడంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆర్జీవీ. లోకేష్‌ను చూస్తే జాలి పడాలో, నవ్వాలో అర్థం కావట్లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి తాను సేవ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. తాను ఫిల్మ్‌ మేకర్‌నని, సినిమాలు తీయటం తన పని అని చెప్పారు. లోకేష్‌లాగా జనాలకు సేవ చేయడానికి పుట్టాను, చస్తాను అని ఏనాడు చెప్పలేదన్నారు.

తనను విమర్శించడానికి ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేయడం తప్పితే మరో అంశమే దొరకలేదా అంటూ లోకేష్‌ను ప్రశ్నించారు. లోకేష్‌ ప్లేస్‌లో తానుంటే ఇలా విమర్శించేవాడినంటూ సూచనలు కూడా చేశారు ఆర్జీవీ. వాడో పిచ్చి నా కొడుకు, హిట్‌ సినిమా తీసి ఎన్నాళ్లయింది, పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తాడు..అడ్డదిడ్డమైన ట్వీట్లు పెడతాడు. అలాంటి వాడి విమర్శలకు నేను రియాక్ట్ కావడం, సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదంటూ చాలా ఈజీగా అనొచ్చన్నారు ఆర్జీవీ. ఆ మాత్రం తెలివి కూడా లేకపోతే ఎలా బేబీ అంటూ లోకేష్‌పై సెటైర్లు వేశారు ఆర్జీవీ.

తన జీవితం తెరిచిన పుస్తకమని..లోకేష్‌లాగా ఎక్కడో స్విమ్మింగ్‌ఫూల్స్‌లో అమ్మాయిలతో ఆడిన ఫొటోలు దాచే అవసరం తనకు లేదన్నారు. చంద్రబాబు గారి పరిస్థితిని చూసి లోకేష్‌ మైండ్ పని చేయట్లేదేమో అన్నారు ఆర్జీవీ. వీలైతే డాక్టర్‌ను కన్సల్ట్‌ కావాలంటూ లోకేష్‌కు చురకలు అంటించారు. ఏది పడితే అది మాట్లాడితే రాంగ్ సిగ్నల్ వెళ్తుందని..లోకేష్‌ మంచి కోసమే చెప్తున్నానంటూ ట్విట్టర్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ.

First Published:  29 Oct 2023 9:15 PM IST
Next Story