Telugu Global
Andhra Pradesh

లోకేష్‌కు ఆ రెండూ లేవు.. RGV కౌంటర్‌

నారా లోకేష్‌ ట్వీట్‌పై స్పందించారు ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. లోకేష్‌ ట్వీట్ చూస్తే అతనికి బ్రెయిన్‌తో పాటు హృదయం కూడా లేదన్న విషయం అర్థమవుతోందంటూ కౌంటర్ ట్వీట్ చేశారు RGV.

లోకేష్‌కు ఆ రెండూ లేవు.. RGV కౌంటర్‌
X

వైసీపీ అధినేత జగన్‌పై దాడి విషయంలో తెలుగుదేశం, ఆ పార్టీ నేతలు తమ పైశాచికత్వాన్ని బయటపెడుతున్నారు. ఓ వైపు దాడిని ఖండిస్తున్నామంటూనే సోషల్‌మీడియాలో వెకిలి పోస్టులు పెడుతున్నారు. దీంతో టీడీపీ, ఆ పార్టీ నేతల తీరును వైసీపీ అభిమానులతో పాటు సామాన్యులు సైతం చీదరించుకుంటున్నారు.


తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సైతం తన వక్రబుద్ధిని ప్రదర్శించారు. జగన్‌పై దాడిని కుట్రగా అభివర్ణిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ దాడి వెనుక తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్ జరిగిందనేది లోకేష్‌ ట్వీట్‌ ఉద్దేశం. జగన్‌ కొత్తగా ఇంకేదైనా ట్రై చేయాలంటూ ట్వీట్ చేశారు లోకేష్‌.

నారా లోకేష్‌ ట్వీట్‌పై స్పందించారు ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. లోకేష్‌ ట్వీట్ చూస్తే అతనికి బ్రెయిన్‌తో పాటు హృదయం కూడా లేదన్న విషయం అర్థమవుతోందంటూ కౌంటర్ ట్వీట్ చేశారు RGV. రాయి కాస్త కింద తగిలి ఉంటే జగన్‌ కన్ను పోయేదని.. అప్పుడు కూడా ఇలానే ఆలోచిస్తారా అంటూ లోకేష్‌ను ప్రశ్నించారు RGV.

First Published:  14 April 2024 5:15 AM
Next Story